Congress Win : తెలంగాణ‌లో హ‌స్తం హ‌వా

ఇండియా టుడే ఎగ్జిట్ పోల్

Congress : న్యూఢిల్లీ – తెలంగాణ‌లో ఎన్నిక‌ల ఫలితాల‌కు సంబంధించి ప్ర‌ముఖ మీడియా సంస్థ ఇండియా టుడే సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. ఈ మేర‌కు తాము నిర్వ‌హించిన స‌ర్వే పోల్ లో ఆస‌క్తిక‌ర‌మైన అంశాలు వెల్ల‌డైన‌ట్లు తెలిపింది. ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన స‌ర్వేల‌న్నీ ముందస్తుగా కాంగ్రెస్ పార్టీకి ఏ పార్టీపై ఆధార ప‌డ‌కుండానే ఒంట‌రిగానే అధికారంలోకి రాబోతోంద‌ని వెల్ల‌డించాయి.

Congress Win Viral

శుక్ర‌వారం ఇండియా టుడే – యాక్సిస్ మై ఇండియా ప్ర‌క‌టించిన ఎగ్జిట్ పోల్ లో కాంగ్రెస్ పార్టీ బంప‌ర్ మెజారిటీ సాధించ బోతోంద‌ని ప్ర‌క‌టించింది. ఇందులో అధికారంలో ఉన్న భార‌త రాష్ట్ర స‌మితి పార్టీకి 34 నుంచి 44 సీట్లు వ‌స్తాయ‌ని తెలిపింది.

ఇక నిన్న‌టి దాకా ప్ర‌తిప‌క్ష పాత్ర పోషించి, ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై గ‌ళ‌మెత్తిన కాంగ్రెస్(Congress) పార్టీ అనూహ్యంగా పుంజుకుంద‌ని, ఇక ఆ పార్టీకి క‌నీసం 63 నుంచి 73 సీట్లు వ‌స్తాయ‌ని స్ప‌ష్టం చేసింది ఇండియా టుడే. ఇక భార‌తీయ జ‌న‌తా పార్టీకి 4 నుంచి 8 సీట్లు , ఎంఐఎం పార్టీకి 5 నుంచి 7 సీట్లు రాబోతున్నాయ‌ని పేర్కొంది .

ఇండిపెండెంట్ల ప‌రంగా చూస్తే ఒక సీటు రావ‌చ్చ‌ని అంచ‌నా వేసింది. మొత్తంగా అన్ని స‌ర్వే సంస్థ‌లు, మీడియా సంస్థ‌ల‌న్నీ గంప గుత్త‌గా కాంగ్రెస్ పార్టీకి జై కొట్టాయి.

Also Read : Minister KTR : ఎగ్జిట్ పోల్స్ ఫేక్ బీఆర్ఎస్ షేక్

Leave A Reply

Your Email Id will not be published!