Metro Train : ప్ర‌ధాని ఆరంభించనున్న డ్రైవర్ లేని‌ మెట్రో ట్రైన్‌

Driver less Metro Train: భారత్ లో డ్రైవర్‌లెస్‌ మెట్రో ట్రైన్ మొద‌టిసారిగా పట్టాలెక్కనుంది. రైల్‌ నెట్‌వర్క్‌ నేషనల్‌ క్యాపిటల్‌ రీజియన్‌-జనక్‌పురి వెస్ట్‌ నుంచి నోయిడాలోని బొటానికల్‌ గార్డెన్‌ వరకు విస్తరించి ఉన్న రైలు మార్గంలో ఈ డ్రైవర్‌లెస్‌ మెట్రో ట్రైన్ ప‌రుగులు తీయ‌నుంది.

Metro Train : భారత్ లో డ్రైవర్‌లెస్‌ మెట్రో ట్రైన్ మొద‌టిసారిగా పట్టాలెక్కనుంది. రైల్‌ నెట్‌వర్క్‌ నేషనల్‌ క్యాపిటల్‌ రీజియన్‌-జనక్‌పురి వెస్ట్‌ నుంచి నోయిడాలోని బొటానికల్‌ గార్డెన్‌ వరకు విస్తరించి ఉన్న రైలు మార్గంలో ఈ డ్రైవర్‌లెస్‌ మెట్రో ట్రైన్ ప‌రుగులు తీయ‌నుంది. దేశంలోనే మొట్టమొదటి సారిగా ఢిల్లీ మెట్రోలోని 37 కిలోమీటర్ల పొడవైన మెజెంటా మార్గంలో తొలి డ్రైవర్‌లెస్‌ ట్రైన్‌ పరుగులుపెట్టనుండ‌గా దీనిని ప్రధాని మోడీ సోమవారం ప్రారంభించనున్నారు. ఈ ఆటోమేటెడ్‌ డ్రైవర్‌లెస్‌ రైళ్లు ప్ర‌పంచ వ్యాప్తంగా ప‌లు దేశాల‌లోఎలాంటి తప్పిదాలకు, ప్ర‌మాదాల‌కు ఆస్కారం లేకుండా నడుస్తున్న తీరును ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని భార‌త్‌లో తొలి సారి ప్ర‌వేశ‌పెడుతున్న‌ట్టు ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. ప్ర‌ధాని ఈ రైళ్ల‌ని ఆరంభించిన అనంత‌రం సాధారణ ప్రయాణికులకు వీటి సేవలు అందుబాటులోకి రానున్న‌ట్టు ఢిల్లీ మెట్రో అధికారి ఒక‌రు మీడియాకు తెలిపారు.

The first ‘driverless’ train will roll out on the 37-km long Magenta Line of the Delhi Metro. Photo: PTI (Representative image)

No comment allowed please