S Jai Shankar : యుఎన్ బ‌లోపేతంపై భార‌త్ ఫోక‌స్ – జై శంక‌ర్

యుఎన్ 77వ వార్షికోత్స‌వంలో ప్ర‌క‌ట‌న

S Jai Shankar : అన్ని రంగాల‌లో యుఎన్ బ‌లోపేతం చేయ‌డంపై భార‌త దేశం ఫోక‌స్ పెడుతోంద‌ని చెప్పారు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుబ్ర‌మ‌ణ్యం జై శంక‌ర్. ఐక్య రాజ్య స‌మితి ఏర్ప‌డి 77 ఏళ్ల‌వుతున్న సంద‌ర్భంగా సోమ‌వారం జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్ర‌సంగించారు.

ఐక్య రాజ్య స‌మితికి అన్ని విధాలుగా తోడ్పాటు అందించే దిశ‌గా ప్ర‌య‌త్నం చేస్తోంద‌న్నారు జై శంక‌ర్. ఇంట‌ర్ గ‌వ‌ర్న‌మెంట‌ల్ ఆర్గ‌నైజేష‌న్ వ్య‌వ‌స్థాప‌క స‌భ్యుడైన భార‌త దేశం ఎల్ల‌ప్పుడూ యుఎన్ ప్ర‌భావం త‌గ్గ‌కుండా ఉండేలా చేస్తుంద‌న్నారు కేంద్ర విదేశాంగ మంత్రి(S Jai Shankar).

భ‌ద్ర‌తా మండ‌లిలో స‌భ్యునిగా భార‌త్ కొన‌సాగుతున్న ప‌ద‌వీ కాలం స‌మకాలీన స‌వాళ్ల‌ను ఎదుర్కొనేందుకు సంభాష‌ణ‌, దౌత్యాన్ని ప్రోత్స‌హించే సూత్ర‌ప్రాయ విధానాన్ని ప్ర‌తిబింబిస్తుంద‌న్నారు జై శంక‌ర్. తాము ఎల్ల‌ప్పుడూ గ్లోబ‌ల్ సౌత్ కు అండ‌గా ఉంటామ‌ని స్ప‌ష్టం చేశారు.

సంస్క‌రించ‌బ‌డిన బ‌హుపాక్షిక‌త‌, న్యాయ పాల‌న , న్యాయ‌మైన , స‌మాన‌మైన అంత‌ర్జాతీయ వ్య‌వ‌స్థ‌పై భార‌త దేశం దృష్టి సారించింద‌న్నారు. ఇది పూర్తిగా ఐక్య రాజ్య స‌మితి సంబంధితంగా కొన‌సాగేలా చూడ‌డ‌మేన‌ని పేర్కొన్నారు కేంద్ర మంత్రి. వ్య‌వ‌స్థాప‌క స‌భ్యునిగా భార‌త దేశం దాని ల‌క్ష్యాలు , సూత్రాల‌కు క‌ట్టుబ‌డి ఉంద‌ని మ‌రోసారి స్ప‌ష్టం చేశారు జై శంక‌ర్(S Jai Shankar).

చార్ట‌ర్ ల‌క్ష్యాల‌ను అమ‌లు చేయ‌డంలో త‌మ స‌హ‌కారం ఈ నిబ‌ద్ద‌త‌కు నిద‌ర్శ‌న‌మ‌ని పేర్కొన్నారు. ఇదిలా ఉండ‌గా ఐక్య రాజ్య స‌మితి 24,1945లో ఏర్పాటైంది. శాశ్వ‌త భ‌ద్ర‌తా మండ‌లిలో ఐదు స‌భ్య దేశాలు ఉన్నాయి. చైనా, ఫ్రాన్స్ , ర‌ష్యా, యుకె, యుఎస్ దేశాలు కీల‌కంగా ఉన్నాయి. జెనీవా, నైరోబీ, వియ‌న్నా, హేగ్ తో పాటు న్యూయార్క్ లో ప్ర‌ధాన కార్యాల‌యాలు క‌లిగి ఉన్నాయి.

Also Read : రాకెట్ ప్ర‌యోగం స‌మిష్టి విజ‌యం – ఇస్రో

Leave A Reply

Your Email Id will not be published!