Sheikh Hasina : భార‌త దేశం సాయం మరువ‌లేం

పీఎం మోదీకి షేక్ హ‌సీనా థ్యాంక్స్

Sheikh Hasina : బంగ్లాదేశ్ ప్ర‌ధాన మంత్రి షేక్ హ‌సీనా ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తింది భార‌త దేశాన్ని. ప్ర‌ధానంగా క‌రోనా మ‌హమ్మారి నెల‌కొన్న స‌మ‌యంలో, రష్యా ఏక‌పంగా ఉక్రెయిన్ పై దాడి చేసిన చేసిన సాయం మ‌రిచి పోలేమ‌ని పేర్కొన్నారు.

ఈ సంద‌ర్బంగా తాను సోద‌రుడిగా భావించే భార‌త ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీకి ధ‌న్య‌వాదాలు తెలియ చేసుకుంటున్నాన‌ని స్ప‌ష్టం చేశారు.

సోమవారం షేక్ హ‌సీనా భార‌త దేశంలో ప‌ర్య‌టించేందుకు రానున్నారు. ఈసంద‌ర్భంగా జాతీయ మీడియాతో ఆమె ముచ్చ‌టించారు. త‌న అభిప్రాయాల‌ను, ఆలోచ‌న‌ల‌ను పంచుకున్నారు.

భార‌త దేశం అన్ని దేశాల కంటే మిన్న‌గా త‌మ దేశం ప‌ట్ల ఆద‌ర‌ణ‌ను క‌న‌బ‌ర్చింద‌న్నారు. ప్ర‌ధానంగా ర‌ష్యా – ఉక్రెయిన్ వివాదం చెల‌రేగ‌డంతో తూర్పు యూర‌ప్ లో చిక్కుకు పోయిన తమ దేశానికి చెందిన విద్యార్థుల‌ను ర‌క్షించేందుకు ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ(PM Narendra Modi) ప్ర‌త్యేకంగా చొరవ చూపార‌ని ప్ర‌శంసించారు.

అంతే కాకుండా క‌రోనా క‌ష్ట కాలంలో త‌మ దేశానికి పెద్ద ఎత్తున టీకాల‌ను స‌ర‌ఫ‌రా చేశార‌ని దీని గురించి ఎంత చెప్పినా త‌క్కువేన‌న్నారు బంగ్లాదేశ్ పీఎం షేక్ హ‌సీనా(Sheikh Hasina). ఇరు దేశాల మ‌ధ్య బంధం ఎప్ప‌టికీ కొన‌సాగుతూనే ఉంటుంద‌న్నారు.

భిన్న‌మైన అభిప్రాయాలు ఉండ‌టంలో త‌ప్పు లేద‌ని కానీ ఒకే అంశంపై మాత్రం ఏకాభ్రిపాయం ఉండి తీరాల్సిందేన‌ని స్ప‌ష్టం చేశారు పీఎం.

అప‌రిష్కృతంగా ఉన్న స‌మ‌స్య‌ల‌ను చ‌ర్చ‌ల ద్వారా ప‌రిష్క‌రించు కోవాల‌ని కోరారు. భార‌త్, బంగ్లాదేశ్ దేశాలు ఆనేక ప్రాంతాల్లో క‌చ్చితంగా ఆ ప‌ని చేశాయ‌ని అన్నారు.

ఒక్క త‌మ దేశానికే కాదు ప్ర‌పంచంలోని చాలా దేశాల‌కు వ్యాక్సిన్ ను ఉచితంగా అందించిన ఘ‌న‌త మోదీకే ద‌క్కుతుంద‌న్నారు షేక్ హ‌సీనా.

Also Read : ప్ర‌కృతి ప్ర‌కోపం పాకిస్తాన్ అత‌లాకుత‌లం

Leave A Reply

Your Email Id will not be published!