PM Modi : ప్రపంచ పురోగతిలో భారతీయుల ముద్ర – మోదీ
భారత్ సాధించిన విజయాలు అసమాన్యం
PM Modi : భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ పురోగతిలో భారతీయులు కీలకమైన పాత్ర పోషిస్తున్నారని అన్నారు. మంగళవారం ఇండోనేషియాలోని బాలిలో జరిగిన జీ20 శిఖరాగ్ర సమావేశంలో మోదీ(PM Modi) పాల్గొని ప్రసంగించారు.
ఈ ఏడాది డిసెంబర్ 1 నుండి భారత దేశం జీ20 గ్రూప్ నకు సారథ్యం వహించనుంది. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కరోనా కష్ట కాలంలో ఎదుర్కొన్నామని, రాబోయే 25 ఏళ్లలో భారత దేశం అన్ని రంగాలలో పురోభివృద్ది సాధించడం ఖాయమన్నారు.
ఇందుకు ఇప్పటి నుంచే తాము ప్లాన్ వేశామన్నారు. సమున్నత భారత దేశం కీలక రంగాలలో తనదైన ముద్ర వేస్తోందన్నారు. ఐటీ, మౌలిక సదుపాయాలు, లాజిస్టిక్స్ , ఫార్మా, తదితర ప్రధాన రంగాలలో ప్రవాస భారతీయులు ఉన్నత పదవుల్లో ఉన్నారని ఈ సందర్భంగా మరోసారి ప్రస్తావించారు ప్రధానమంత్రి(PM Modi) .
తాము అధికారంలోకి వచ్చాక దేశ స్వరూపాన్ని మార్చి వేశామన్నారు. జనాభా పరంగా అమెరికా, యురోపియన్ యూనియన్ల కంటే ఎక్కువగా ఉన్నా ఆశించిన మేర కంటే ఎక్కువగా ప్రగతి సాధించామన్నారు. ప్రధానంగా భారత దేశం ప్రతిభ, సాంకేతికత, ఆవిష్కరణ , పరిశ్రమ ప్రపంచ గుర్తింపును కలిగి ఉందన్నారు.
2014 నుండి భారత దేశం 320 మిలియన్లకు పైగా బ్యాంకు ఖాతాలను తెరిచిందని చెప్పారు మోదీ. ఇది ఆ రెండు దేశాల జనాభా కంటే ఎక్కువ అన్నారు.
సన్నిహిత సాంస్కృతిక నాగరికత సంబంధాలను , శక్తివంతమైన బంధాలను మరింతగా బలోపేతం చేయడంలో ప్రవాసులు కీలకమైన పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు నరేంద్ర మోదీ.
Also Read : హోసూర్ లో ఐఫోన్ తయారీ యూనిట్