Indore Tops : పరిశుభ్రమైన నగరాల్లో ఇండోర్ టాప్
తర్వాతి స్థానంలో సూరత్..మహారాష్ట్ర
Indore Tops : దేశంలో అత్యంత పరిశుభ్రమైన నగరాలను కేంద్ర ప్రభుత్వం. ఇండోర్(Indore Tops) వరుసగా ఆరోసారి అత్యంత పరిశుభ్రమైన నగరంగా ఎంపికైంది. కేంద్ర ప్రభుత్వ వార్షిక స్వచ్ఛత సర్వే లో సూరత్ , నవీ ముంబై తర్వాతి రెండు స్థానాల్లో నిలిచాయి. స్వచ్ఛ్ సర్వేక్షణ్ అవార్డ్స్ 2022లో అత్యుత్తమ పనితీరు కనబర్చిన రాష్ట్రాల కేటగిరీలో మధ్య ప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది.
చత్తీస్ గఢ్ , మహారాష్ట్ర తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇక ఈ ఏడాది పెద్ద నగరాల విభాగంలో విజయవాడ మూడో స్థానాన్ని కోల్పోయింది. 100 కంటే తక్కువ పట్టణ స్థానిక సంస్‌థలను కలిగి ఉన్న రాష్ట్రాలలో సర్వే ఫలితాల ప్రకారం త్రిపుర మొదటి స్థానంలో నిలిచింది.
కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి , ఇతరులు కూడా పాల్గొన్న ఒక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విజేతలకు అవార్డులను అందజేశారు. లక్ష కంటే తక్కువ జనాభా కలిగి ఉన్న నగరాల కేటగిరీలో మహారాష్ట్రలోని పంచగని మొదటి స్థానంలో నిలిచింది.
ఛత్తీస్ గఢ్ లోని పటాన్ , మహారాష్ట్ర లోని కర్హాద్ తర్వాతి స్థానంలో ఉన్నాయి. లక్ష కంటే ఎక్కువ జనాభా కేటగిరీఈలో హరిద్వార్ పరిశుభ్రమైన గంగా పట్టణంగా ఎంపికైంది. వారణాసి, రిషికేశ్ తర్వాతి స్థానంలో నిలిచాయి. బిజ్నోర్ ఒక లక్ష కంటే తక్కువ జనాభా ఉన్న పట్టణాలలో గంగ టాప్ లో నిలిచింది.
కన్నౌజ్ , గుర్హ్మైక్తేశ్వర్ పట్టణాలు ఉన్నాయి. సర్వేలో మహారాష్ట్రకు చెందిన డియోలాలి అత్యంత పరిశుభ్రమైన కంటోన్మెంట్ బోర్డుగా ఎంపికైంది.
Also Read : షోపియాన్ లో లష్కర్ ఉగ్రవాది ఖతం