Infor Campus : ఇన్ఫోర్ డెవలప్‌మెంట్ క్యాంప‌స్

ప్రారంభించిన ఇన్ ఫ‌ర్ కంపెనీ

Infor Campus : హైద‌రాబాద్ లో మ‌రో డెవ‌ల‌ప్ మెంట్ క్యాంప‌స్ ఏర్పాటైంది. దీనిని ప్ర‌ముఖ కంపెనీ ఇన్ ఫ‌ర్(Infor Campus) ఏర్పాటు చేసింది. హైటెక్ సిటీలో దీనిని ప్రారంభించారు. ఇండియా వ్యాప్తంగా ఇక్క‌డి నుంచి సేవ‌లు అందిస్తుంది. టెక్నాల‌జీ, వ్యాపారానికి దేశంలోనే టాప్ లో కొన‌సాగుతోంది. కొత్త‌గా ఏర్పాటైన ఈ క్యాంప‌స్ బ‌హుళ అంత‌స్తుల అత్యాధునిక అభివృద్ది కేంద్రంగా రూపుదిద్దుకుంది.

మొత్తం 3,50,000 చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణంలో ఉంది. 3,500 మంది ఈ క్యాంప‌స్ లో ప‌ని చేసేందుకు వీలవుతుంది. తెలంగాణ ప్ర‌భుత్వంలోని ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్యం , ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ విభాగాల ప్రిన్సిప‌ల్ కార్య‌ద‌ర్శి జ‌యేష్ రంజ‌న్ , ఇన్ఫోర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస‌ర్ కేవిన్ శామ్యూల్స‌న్ ఈ సెంట‌ర్ ను ప్రారంభించారు. ఈ కంపెనీ ఇండియాలో టాప్ కంపెనీల‌లో ఒక‌టిగా పేరొందింది.

దేశంలో 3,700 మందికి పైగా ఉద్యోగులు ప్ర‌పంచ మార్కెట్ ప్లేస్ కు పోటీతత్వం, మార్కెట్ నాయ‌క‌త్వాన్ని పొందేందుకు కీల‌క సాంకేతిక ఆవిష్క‌ర‌ణ‌లు అందిస్తున్నారు. ప‌రిశ్ర‌మ‌ల కోసం ప్రత్యేకించి క్లౌడ్ , మొబిలిటీ, డేటా అన‌లిటిక్స్ , ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ , ఐఓటీ వంటి డిజిట‌ల్ సాంకేతిక‌త‌ల‌ను అందిస్తోంది. టెక్నాల‌జీ కంపెనీల‌కు ప్రాధాన్య‌త క‌లిగిన ఐటీ హ‌బ్ గా హైద‌రాబాద్ వేగంగా అభివృద్ది చెందుతోంది.

హైద‌రాబాద్ కొత్త డెవ‌ల‌ప్ మెంట్ క్యాంప‌స్ ను ప్రారంభించ‌డం ఆనందంగా ఉంద‌న్నారు ఐటీ సెక్ర‌ట‌రీ జ‌యేశ్ రంజ‌న్. భార‌తీయ ప్ర‌తిభావంతుల‌కు ప‌రిశ్ర‌మ‌ల భ‌విష్య‌త్తును తీర్చిదిద్దే అవ‌కాశం ల‌భిస్తుంద‌న్నారు. ఇందుకు ప్ర‌త్యేకంగా ఇన్ఫోర్ కంపెనీని అభినందిస్తున్న‌ట్లు చెప్పారు.

వ్యాపారాల‌ను బ‌లోపేతం చేసేందుకు, ప్ర‌పంచ వేదిక‌పై హైద‌రాబాద్ స్థానాన్ని సుస్థిరం చేసేందుకు ఈ డెవ‌ప‌ల్ మెంట్ సెంట‌ర్ ఓ ఉదాహ‌ర‌ణ అని పేర్కొన్నారు.

Also Read : ఏపీ సీఎం ప‌నితీరు భేష్ – లార్స‌న్

Leave A Reply

Your Email Id will not be published!