Mohit Joshi : ఇన్ఫోసిస్ ప్రెసిడెంట్ మోహిత్ జోషి రిజైన్
టెక్ మహీంద్రాలో చేరేందుకు రెడీ
Mohit Joshi : ప్రముఖ భారతీయ టెక్ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్ కు బిగ్ షాక్ తగిలింది. ఇన్ఫోసిస్ ప్రెసిడెంట్ గా ఉన్న మోహిత్ జోషి(Mohit Joshi) తన పదవికి రాజీనామా చేశారు. శనివారం కీలక ప్రకటన చేశారు. టెక్ మహీంద్రాలో చేరేందుకు రాజీనామా చేసినట్లు రెండు సంస్థలు స్టాక్ ఎక్ష్చేంజ్ కు తెలపడం విశేషం. మోహిత్ జోషి టెక్ మహీంద్రా మేనేజింగ్ డైరెక్టర్ గా , చీఫ్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ గా నియమితులయ్యారు.
ఇదిలా ఉండగా మోహిత్ జోషి గత 2000 సంవత్సరం నుండి ఇన్ఫోసిస్ లో కీలక బాధ్యతలు చేపట్టారు. మోహిత్ జోషి మార్చి 11 నుండి సెలవులో ఉంటారని , కంపెనీతో అతడి చివరి తేదీ జూన్ 9, 2023 అని బాంబే స్టాక్ ఎక్ష్చేంజ్ కి ఇన్ఫోసిస్ స్పష్టం చేసింది. ఈ మేరకు కీలక ప్రకటన తో తెలిపింది.
మోహిత్ జోషి అందించిన సేవలకు ఇన్ఫోసిస్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు తమ ప్రగాఢమైన ప్రశంసలు కురిపించారు. ఇక మోహిత్ జోషి(Mohit Joshi) ఇన్ఫోసిస్ లో ప్రెసిడెంట్ గా , ఫైనాన్షియల్ సర్వీసెస్ , హెల్త్ కేర్, లైఫ్ సైన్సెస్ వ్యాపారాలు చేపట్టారు. ఆయన ఎడ్జ్ వెర్వ్ సిస్టమ్స్ లిమిటెడ్ చైర్మన్ గా కూడా ఉన్నారు. గ్లోబల్ బ్యాంకింగ్ ప్లాట్ ఫారమ్ , ఫినాకిల్ ను కలిగి ఉన్న సంస్థ సాఫ్ట్ వేర్ వ్యాపారానికి నాయకత్వం వహించారు.
మోహిత్ జోషి 2014లో వరల్డ్ ఎకానమిక్ ఫోరమ్ లో గ్లోబల్ యంగ్ లీడర్ ప్రోగ్రామ్ కు కూడా ఆహ్వానం అందుకున్నారు. ఆయన బ్రిటీష్ ఇండస్ట్రీకి చెందిన ఎకనామిక్ గ్రోత్ బోర్డ్ ఆఫ్ కాన్ఫెడరేషన్ వైస్ చైర్మన్ గా , యంగ్ ప్రెసిడెంట్స్ ఆర్గనైజేషన్ సభ్యుడిగా కొనసాగారు.
Also Read : సిలికాన్ వ్యాలీ బ్యాంక్ మూసివేత