TTD Chairman : బస్సు ప్రమాదంపై విచారణ – వైవీఎస్
డౌన్ ఘాట్ రోడ్డులో కాంక్రీట్ రీటైనింగ్ వాల్ నిర్మాణం
TTD Chairman : తిరుమల – తిరుపతి ఘాట్ రోడ్డులో జరిగిన బస్సు ప్రమాదంపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్(TTD Chairman) వైవీ సుబ్బారెడ్డి. వెంటనే పూర్తి వివరాలు ఇవ్వాలని ఉన్నతాధికారులను సూచించారు. డౌన్ ఘాట్ రోడ్డులోకూడా కాంక్రీట్ తో రీటైనింగ్ వాల్ నిర్మాణం చేపట్టాలన్నారు.
ఘాట్ రోడ్డులో బస్సు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని గురువారం టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరు, ఇందుకు దారి తీసిన కారణాలు ఏమై ఉండవచ్చని ఆరా తీశారు. ఇందుకు సంబంధించి అధికారులతో చర్చించారు.
అనంతరం వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు. బస్సులో సాంకేతిక ఇబ్బందులు ఏవీ లేవని ఓలెక్ట్రా సంస్థ ప్రతినిధులు , ఆర్టీసీ అధికారులు సమాచారం ఇచ్చారని చెప్పారు. అతి వేగం లేదా డ్రైవర్ నిర్లక్ష్యం ప్రమాదానికి కారణమై ఉండవచ్చాని పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాల్సిందిగా ఆదేశించడం జరిగిందన్నారు వైవీ సుబ్బారెడ్డి.
శ్రీ వేంకటేశ్వర స్వామి దయ వల్ల బస్సులోని ప్రయాణీకులు ఎవరికీ పెద్దగా గాయాలు కాలేదన్నారు. ఇదంతా స్వామి వారి దయేనని చెప్పారు. తిరుమలకు వచ్చిన భక్తులను క్షేమంగా తిరుపతికి చేర్చేందుకు టీటీడీ అన్ని భద్రతా చర్యలు తీసుకుంటుందన్నారు.
Also Read : KTR Bobby Reddy