PM Modi : ఐఎన్ఎస్ విక్రాంత్ దేశానికి గర్వకారణం
ప్రారంభించిన ప్రధాన మంత్రి మోదీ
PM Modi : భారత దేశం స్వయంగా తయారు చేసిన ఐఎన్ఎస్ విక్రాంత్(INS Vikrant) ను శుక్రవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఒకటవ భారత నిర్మిత విమాన వాహన నౌక ఇది. ఏకంగా రూ. 20,000 కోట్ల రూపాయల ఖర్చు తో దీనిని నిర్మించారు.
262 మీటర్ల పొడవు, 62 మీటర్ల వెడల్పుతో అతి పెద్ద నౌకగా కొలువు తీరింది. ఇందులో 30 విమానాలు, దాదాపు ,1 600 మంది సిబ్బంది ఉండేందుకు వీలుంది.
కొచ్చిన షిప్ యార్డ్ లో జరిగిన అంగరంగ వైభవోత్సవ కార్యక్రమంలో ప్రధాని దేశీయంగా తయారు చేసిన తొలి విమాన నౌక ఐఎన్ఎస్ విశ్రాంత్ ను ప్రారంభించారు.
45,000 వేల టన్నుల బరువున్న ఈ యుద్ద నౌకకు భారీగా ఖర్చు చేయడం విశేషం. ఇందులో ఎంఐజీ- 29కె ఫైటర్ జెట్ లు , హెలికాప్టర్ లతో సహా 30 విమానాలు ఉండేందుకు వీలు కలుగుతుంది.
ఈ సందర్భంగా ప్రధాన మంత్రి మోదీ(PM Modi) ప్రసంగించారు. ఆత్మ నిర్భర్ భారత్ మిషన్ ప్రతిబింబమే ఈ ఐఎన్ఎస్ విక్రాంత్ అని పేర్కొన్నారు.
ఇవాళ భారత దేశం భారీ యుద్ద నకలను దేశీయంగా నిర్మించగల దేశాల జాబితాలోకి ప్రవేశించిందన్నారు. విక్రాంత్ కొత్త విశ్వాసాన్ని నింపాడని తెలిపారు.
మరో వైపు కొత్త నౌకాదళ జెండాను కూడా ప్రధాన మంత్రి ఆవిష్కరించారు. కొత్త చిహ్నం ఎగువ ఖండంలో జాతీయ జెండాను కలిగి ఉంది.
జాతీయ చిహ్నంతో కూడిన నీలి రంగుతో ఆకట్టుకునేలా కొలువు తీరింది. నౌకదళ నినాదంతో షీల్డ్ పై అమర్చబడి ఉంది. భారతీయ చక్రవర్తి ఛత్రపతి శివాజీ మహరాజ్ నుంచి స్పూర్తి పొందింది.
Also Read : గార్డ్ ఆఫ్ హానర్ ను అందుకున్న మోదీ