Mallikarjun Kharge : సంస్థాగత జవాబుదారీతనం అవసరం
స్పష్టం చేసిన ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే
Mallikarjun Kharge : పార్టీలో సంస్థాగత జవాబుదారీతనం అత్యంత అవసరమని స్పష్టం చేశారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే. ఆదివారం పార్టీ పరంగా కీలక సమావేశం ఢిల్లీలో జరిగింది. పార్టీలో సీనియర్లు, ఇతర భాద్యులు తమ కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నారని అయితే ఇదే సమయంలో కొందరు మాత్రం బాధ్యతలను విస్మరిస్తున్నారంటూ పేర్కొన్నారు ఖర్గే.
అగ్ర నాయకుడు , వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో చేపట్టిన భారత్ జోడో యాత్ర జాతీయ ఉద్యమంగా రూపు దిద్దుకుందని చెప్పారు. కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఎవరైనా సరే తమ పదవులను సమర్థవంతంగా నిర్వహించాలని స్పష్టం చేశారు ఖర్గే.
ఇదే సమయంలో ఒకవేళ పని చేయక పోతే తమ లైన్ లో ఉన్న ఇతర నాయకులకు అవకాశం ఇవ్వాలని సూచించారు. మల్లికార్జున్ ఖర్గే ఆధ్వర్యంలో కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీ మొదటిసారిగా సమావేశం నిర్వహించారు. ఖర్గే(Mallikarjun Kharge) రాబోయే 30 నుడి 90 రోజుల్లో ప్రజా సమస్యలపై ఉద్యమించేందుకు రోడ్ మ్యాప్ ను సమర్పించాలని ఆయా రాష్ట్రాల ఇన్ చార్జీలను కోరారు.
ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు ఏఐసీసీ చీఫ్. పార్టీతో పాటు దేశం పట్ల మనకు బాధ్యత ఉందన్నారు ఖర్గే. పార్టీ సంస్థాగతంగా మరింత బలంగా ఉందన్నారు. ప్రజల అంచనాలకు అనుగుణంగా ఉంటే మనల్ని జనం ఆదరిస్తారని చెప్పారు మల్లికార్జున్ ఖర్గే. బాధ్యతలు నిర్వహించ లేని వారు తప్పుకుంటే మంచిదన్నారు.
విద్వేష విత్తనాలు చల్లుకుంటూ పోతున్న పాలక శక్తులకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం మనందరిపై ఉందన్నారు ఏఐసీసీ పార్టీ చీఫ్.
Also Read : ఢిల్లీ బల్దియా ఎన్నికల్లో పోటెత్తిన ఓటర్లు