Mallikarjun Kharge : ఖర్గేకు అవమానం కాంగ్రెస్ ఆగ్రహం
సీటు కేటాయింపులో తీవ్ర వివక్ష
Mallikarjun Kharge : ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది కేంద్ర సర్కార్ పై. కొత్తగా కొలువు తీరిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో కావాలని తమ పార్టీకి చెందిన రాజ్యసభ ప్రతిపక్ష నేతగా ఉన్న మల్లికార్జున ఖర్గేను(Mallikarjun Kharge) అవమానించారని ఆరోపించింది.
ఒక ప్రతిపక్ష నేతకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకుండా వివక్ష ప్రదర్శించారని పేర్కొంది. ఇదే విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ రాజ్యసభకు ఫిర్యాదు చేశారు.
ఈ మేరకు సుదీర్ఘ లేఖ రాసింది. పార్లమెంట్ నియమావళిని పక్కన పెట్టారని, భారత రాజ్యాంగం ప్రకారం పేర్కొన్న రూల్స్ ను ఏ మాత్రం పాటించ లేదని ఆరోపించింది కాంగ్రెస్ పార్టీ.
ఇందులో భాగంగా రాజ్యసభ ఎంపీ మల్లికార్జున్ ఖర్గేకు జరిగిన అవమానం ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ అంటూ కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో ఎంపీ జై రాం రమేష్ రాజ్యసభ చైర్మన్ కు రాసిన లేఖను విడుదల చేశారు.
ఈ లేఖలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీతో పాటు అన్ని ప్రతిపక్షాలకు చెందిన ఎంపీలు సంతకాలు ఉన్నాయి. సీనియర్ నాయకుడిని ఉద్దేశ పూర్వకంగానే అగౌరవ పరిచినట్లు ఇందులో అర్థం అవుతుందని పేర్కొన్నారు జైరాం రమేష్.
ప్రాధాన్యతా క్రమంలో ప్రోటోకాల్ ను పాటించాల్సిన అవసరం ఉంది. కానీ దేనినీ పరిగణలోకి తీసుకోలేదు కేంద్ర సర్కార్. ఇది పూర్తిగా అప్రజాస్వామికం. అధర్మం. అనైతికం అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు జై రాం రమేష్.
అయితే కాంగ్రెస్ చేసిన అభియోగంపై ఇంకా ప్రభుత్వం స్పందించ లేదు.
Also Read : నలుగురు కాంగ్రెస్ ఎంపీల సస్పెన్షన్