International Court : ర‌ష్యాకు అంత‌ర్జాతీయ కోర్టు షాక్

వెంట‌నే దాడులు ఆపాల‌ని ఆదేశం

International Court : సైనిక ఆప‌రేష‌న్ పేరుతో ఉక్రెయిన్ పై పూర్తి యుద్దాన్ని ప్రారంభించిన ర‌ష్యాకు కోలుకోలేని షాక్ త‌గిలింది (war on Ukraine). అంత‌ర్జాతీయ కోర్టు వెంటనే ఏక‌ప‌క్ష దాడుల‌ను నిలిపి వేయాల‌ని ఆదేశించింది.

ఇది ఇప్ప‌టి నుంచే అమ‌లు లోకి వ‌స్తుంద‌ని స్ప‌ష్టం చేసింది. ఓ వైపు ఐక్య రాజ్య స‌మితితో పాటు అమెరికా, ఇత‌ర దేశాలు ఆర్థిక ఆంక్ష‌లు విధించాయి ర‌ష్యాపై. యుద్దం ఆపాల‌ని కోరాయి.

కానీ రష్యా దేశాధ్య‌క్షుడు పుతిన్ ఆంక్ష‌ల‌ను బేఖాత‌ర్ చేశారు. విన్న‌పాల్ని ప‌క్క‌న పెట్టారు. ఇప్ప‌టికే దాడుల ప‌రంప‌ర‌లో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఉక్రెయిన్ వ‌ల్ల‌కాడును త‌ల‌పింప చేస్తోంది.

ఇరు దేశాలు త‌గ్గ‌డం లేదు. నువ్వా నేనా అన్న రీతిలో సవాళ్లు ప్ర‌తి స‌వాళ్లు విసురుతూ మూడో యుద్దానికి తెర తీసేలా ప్ర‌వ‌ర్తిస్తున్నారు. వీరిద్ద‌రి వ్య‌వ‌హారం ఇప్పుడు స‌మ‌స్త మాన‌వాళికి చెరుపు చేసేలా ఉంది.

ఇక యుద్దం కార‌ణంగా (International market) (అంతర్జాతీయ మార్కెట్) ఆయిల్ పై ఫోక‌స్ పడింది. ఆయిల్ ధ‌ర‌లు మండుతున్నాయి. వంట నూనె ధ‌ర‌లు కొండెక్కాయి. సందిట్లో స‌డేమియా అన్న చందంగా వ్యాపారులు అందినంత మేర దండుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

ఈ త‌రుణంలో అంత‌ర్జాతీయ న్యాయ స్థానం ( International Court of Justice ) కీలక ఉత్త‌ర్వులు(International Court) జారీ చేసింది. ఉక్రెయిన్ పై సైనిక చ‌ర్య‌ను ఆపాల‌ని ఆదేశించింది.

దాడులు నిలిపి వేయ‌డంతో పాటు ఉక్రెయిన్ భూభాగంపై ర‌ష్యా సేన‌లు కానీ దానికి మ‌ద్ద‌తు ఇచ్చే సాయుధ ద‌ళాలు కానీ ఎటువంటి ఆప‌రేష‌న్ చేప‌ట్ట వ‌ద్దంటూ స్ప‌ష్టం చేసింది.

ఇది త‌మ నైతిక విజ‌య‌మ‌ని పేర్కొన్నారు ఉక్రెయిన్ చీఫ్ జెలెన్ స్కీ. ఆదేశాలు పాటించ‌క పోతే ప్ర‌పంచంలో ర‌ష్యా ఏకాకి గా మారుతుంద‌ని స్ప‌ష్టం చేశారు.

Also Read : ర‌ష్యాకు అంత సీన్ లేదు

Leave A Reply

Your Email Id will not be published!