International Yoga Day : ప్రపంచ వ్యాప్తంగా జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. తొలిసారిగా ఐక్య రాజ్య సమితిలో బుధవారం జరిగే యోగా సెషన్ కు నాయకత్వం వహిస్తున్నారు భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ. తొలి ప్రధాని కూడా ఆయనే కావడం విశేషం. ఎప్పుడైతే మోదీ పీఎంగా కొలువు తీరారో ఆనాటి నుంచి యోగాకు మరింత ప్రయారిటీ పెరిగింది. ప్రస్తుతం ఆయన అమెరికా టూర్ లో ఉన్నారు.
ప్రతి ఏటా ఇదే రోజున యోగా దినోత్సవాన్ని(International Yoga Day) జరుపుకుంటారు. యోగా దినోత్సవంగా జరుపుకునేలా చేసిన ఘనత ప్రధాని మోదీ, బీజేపీ సంకీర్ణ సర్కార్ కు దక్కుతుంది. ఇవాళ ఎక్కడ చూసినా యోగాను ప్రాక్టీస్ చేస్తున్నారు. దానిలో లీనమవుతున్నారు. ఇది శారీరకమైన శక్తికి, మానసిక పరమైన బలానికి , ఆరోగ్యానికి, ఆనందానికి వారధిగా ఉంటోంది. అందుకే చిన్నారుల నుంచి పెద్దల దాకా , సెలిబ్రిటీల నుంచి ప్రముఖుల దాకా యోగాను అనుసరిస్తున్నారు. దానిని ఆచరిస్తున్నారు. తమ దైనందిన జీవితంలో భాగంగా చేసుకున్నారు.
ఇదిలా ఉండగా సెప్టెంబర్ 27, 2014న ప్రధాని ఐక్య రాజ్య సమితి సర్వ సభ్య సమావేశంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపు కోవాలని ప్రతిపాదన చేశారు. ఈ తీర్మానానికి 193 దేశాల ప్రతినిధులు ఉండగా 173 మంది మద్దతుగా నిలిచారు. డిసెంబర్ 2014న ఆమోదం లభించింది. జూన్ 21, 2015న తొలి యోగా అంతర్జాతీయ దినోత్సవాన్ని ప్రపంచ వ్యాప్తంగా జరుపుకున్నారు. 2016, 2017, 2018, 2019, 2020, 2021, 2022, 2023న వరుసగా చేపట్టారు.
Also Read : Nandan Nilekani Donates : జయహో నందన్ నీలేకని
