Whats App Outage : వాట్సాప్ స‌ర్వీసుల‌కు అంత‌రాయం

పున‌రుద్ద‌రిస్తున్న‌ట్లు మెటా ప్ర‌క‌ట‌న

Whats App Outage : ఫేస్ బుక్ – మెటాకు చెందిన వాట్సాప్ స‌ర్వీసులకు తీవ్ర అంత‌రాయం ఏర్ప‌డింది. ప్ర‌పంచ వ్యాప్తంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు యూజ‌ర్లు. కోట్లాది మంది మెటా సంస్థ‌పై ప్ర‌ధానంగా ఫేస్ బుక్ ఫౌండ‌ర్ మార్క్ జుకెర్ బర్గ్ పై నిప్పులు చెరిగారు. విచిత్రం ఏమిటంటే త‌నను అనుస‌రిస్తున్న ల‌క్ష‌లాది మంది ఫాలోవ‌ర్ల‌ను కోల్పోవ‌డం క‌ల‌క‌లం రేపింది.

ఫేస్ బుక్ ను ఇటీవ‌ల మెటాగా మార్చారు. అయినా దాని పురోగ‌తిలో ఎలాంటి మార్పు రాక పోవ‌డం కొంత ఇబ్బందిని క‌లుగ చేస్తోంది. విచిత్రం ఏమిటంటే వాట్సాప్ ద్వారా పంచుకుంటున్న స‌మాచారం క్షేమకరంగా లేద‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. కీల‌క‌మైన ఇన్ఫ‌ర్మేష‌న్ , డేటాను త‌న వ‌ద్ద పెట్టుకుని వ్యాపారం చేస్తోంద‌న్న విమర్శ‌లు ఉన్నాయి.

ఇదే స‌మ‌యంలో వాట్సాప్ టెక్నిక‌ల్ గా(Whats App Outage) అంత‌రాయం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి సోష‌ల్ మీడియాలో ఫేస్ బుక్ – మెటా స్పందించింది. వెంట‌నే సాంకేతిక ప‌ర‌మైన లోపాల‌ను (బ‌గ్స్ ) గుర్తించి పున‌రుద్ద‌రించే ప‌నిలో ప‌డ్డామ‌ని స్ప‌ష్టం చేసింది. మంగ‌ళ‌వారం ఉద‌యం 7.50 గంట‌ల స‌మ‌యం నుంచి వాట్సాప్ స‌ర్వీసుల‌కు తీవ్ర అంత‌రాయం ఏర్ప‌డింది.

వేలాది మంది ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. మ‌రో వైపు టెలిగ్రామ్ వాట్సాప్ కు పెను స‌వాల్ గా మారింది. ఎక్కువ మంది వాట్సాప్ ను ఉప‌యోగించడం లేదు. భారత్ లో 11, 000 , యుకెలో 68,000, త‌దిత‌ర దేశాల నుంచి పెద్ద ఎత్తున వాట్సాప్ స‌ర్వీసులో చోటు చేసుకున్న అంత‌రాయాన్ని ప్ర‌స్తావించారు.

త్వ‌ర‌లోనే పున‌రుద్ద‌రిస్తామ‌ని మెటా ఓక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.

Also Read : విండోస్ యూజ‌ర్ల‌కు గూగుల్ బిగ్ షాక్

Leave A Reply

Your Email Id will not be published!