Red : `రెడ్` చిత్ర దర్శకుడు కిషోర్ తిరుమలతో ఇంటర్యూ
Interview with Kishore Thirumala, director of 'Red'
Red : నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగి, చిత్రలహరి వంటి సూపర్‌హిట్ చిత్రాలతో దర్శకుడిగా తనకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నా రు దర్శకుడు కిషోర్ తిరుమల. ప్రస్తుతం ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం `రెడ్`. రామ్ డ్యూయల్ రోల్ పొషిస్తుండగా నివేదా పేతురాజ్, మాళవిక శర్మ, అమృత అయ్యర్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. కృష్ణ పోతినేని సమర్పణలో స్రవంతి మూవీస్ పతాకంపై `స్రవంతి` రవికిషోర్ నిర్మిస్తుండగా, మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ ప్రేక్షకులను వీపరితంగా ఆకట్టుకుంది. సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ చిత్రం విడుదలకానుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు కిషోర్ తిరుమల ఇంటర్వ్యూ..
వరుస విజయాలతో దూసుకుపోతున్నట్టున్నారే?
అవును.. నా మొదటి చిత్రం `నేను శైలజ` ఒక ప్యూర్లవ్ స్టోరీ, తర్వాత `ఉన్నది ఒకటే జిందగి` పూర్తిగా ఫ్రెండ్షిప్ మీద ఉంటుంది. ఆ తర్వాత ఒక లూజర్ ఎలా సక్సెస్ అయ్యాడు అనే పాయింట్ మీద `చిత్రలహరి` తీశాను. అయితే ఈ సినిమాలో వాటన్నింటితో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. నాకు కూడా కొత్తగా ఉంటుంది కదా అని ఈ కథని ఓకే చేయడం జరిగింది. రామ్‌తో `నేను శైలజ`, `ఉన్నది ఒకటే జిందగి` రెండు సినిమాలు చేశాను కాబట్టి మా ఇద్దరికీ మంచి అండర్స్టాండింగ్ ఉంది.
ఈ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నారే?
ఇస్మార్ట్ శంకర్ తర్వాత రామ్ నటిస్తోన్న చిత్రం కావడం అందులోనూ రామ్ కెరీర్లోనే ఫస్ట్ టైమ్ డ్యూయల్ రోల్ చేస్తున్న సినిమా కాబట్టి ఆయన అభిమానుల్లో మంచి అంచనాలు ఉంటాయి. వాటికి ధీటుగానే కావాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకుని కమర్షియల్ ఎలిమెంట్స్ తో సినిమాని తెరకెక్కించడం జరిగింది. అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత రామ్ ని అభిమానులు ప్రేక్షకులు మరోసారి అలాంటి మాస్ క్యారెక్టర్లోనే చూడాలనుకుంటున్నారు. అందుకే ఈ సినిమాలో ఒక పాత్రని కొంచెం ఇస్మార్ట్ శంకర్ క్యారెక్టర్‌కి దగ్గరగా ఉండేలా డిజైన్ చేశాం.
చిత్ర మాతృకని సమూలంగా మార్చేసినట్టున్నారే…
అవును ఈ సినిమా మాతృకలోని బేసిక్ ఐడియా మాత్రమే తీసుకుని ఫ్రెష్ గా మనం ఒక కథకి ఎలా వర్క్ చేస్తామో అలా దాదాపు ఐదు నెలలు పనిచేశాను. రేపు సినిమా చూస్తే ప్రతి సన్నివేశం కొత్తగా ఉంటుంది.సాదారణంగా ఒక మనిషి వ్యక్తత్వం తను చుట్టూ ఉండే మనుషులు, పెరిగిన వాతావరణం మీద ఆధారపడి ఉంటుంది. అలాగే ఈ సినిమాలో కూడా వారి చుట్టూ ఉన్నమనుషులు, వారు పెరిగిన వాతావరణం కారణంగా వారిద్దరి నేచర్‌లో చాలా తేడా ఉంటుంది. అయితే వారిద్దరి మధ్య సంభందం ఏంటి అనేది సినిమా చేసి తెలుసుకోవాల్సిందే..
సినిమాలోని క్యారెక్టర్లగురించి చెప్పండి
ఈ సినిమాలో నివేదా పేతురాజ్, మాళవిక శర్మ, అమృత అయ్యర్ ముగ్గురు హీరోయిన్స్ ఉన్నారు. ప్రతి పాత్ర కథని ముందుకు తీసుకెళ్లడానికి అవసరమైనదే.. ప్రతి క్యారెక్టర్‌కి జస్టిఫికేషన్ ఉంటుంది.
సాంకేతిక పరంగా…
ఇస్మార్ట్ శంకర్ తర్వాత మణిశర్మ గారు మరో సారి అద్భుతమైన సంగీతం ఇచ్చారు. స్రవంతి రవి కిషోర్‌గారు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాకి కావాల్సినవన్ని సమకూర్చారు. సినిమా అద్భుతంగా రావటంలో అందరి పాత్ర ఉంది.
– ఈ సినిమా తర్వాత శర్వానంద్, రష్మిక మందన్న జంటగా `ఆడాళ్లు మీకు జోహార్లు` సినిమా చేస్తున్నాను. అది ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్.
No comment allowed please