Cheruku Sudhakar : కాంగ్రెస్ గూటికి చెరుకు సుధాకర్
తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర
Cheruku Sudhakar : నల్లగొండ రాజకీయం మరింత వేడెక్కింది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడిగా ఉన్న మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.
ఈ తరుణంలో ఉద్యమ కాలం నుంచి కీలకమైన నాయకుడిగా, వైద్యుడిగా, ఉద్యమకారుడిగా పేరొందిన ఇంటి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్ శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఢిల్లీ లోని ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్, వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ సమంక్షంలో హస్తం పార్టీ కండువా కప్పుకున్నారు.
అంతే కాకుండా చెరుకు సుధాకర్ తాను ఏర్పాటు చేసిన ఇంటి పార్టీని కూడా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన వారిలో సుధాకర్ ఒకరు.
దివంగత జయశంకర్ సార్ తో పాటు కలిసి నడిచిన చరిత్ర ఆయనది. ఎన్నో వేదికలపై తెలంగాణకు జరుగుతున్న అన్యాయం గురించి ప్రజలను చైతన్యవంతం చేశారు.
విలువలతో కూడిన రాజకీయాలు ఉండాలన్నది ఆయన అభిప్రాయం. తాజాగా చెరుకు సుధాకర్(Cheruku Sudhakar) తమ పార్టీలో చేరిన విషయాన్ని అధికారికంగా ప్రకటించారు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ రేవంత్ రెడ్డి.
ఆయనతో పాటు తన ఇంటి పార్టీని కూడా తమ పార్టలో విలీనం చేశారని ఈ సందర్భంగా తెలిపారు. శుక్రవారం ఢిల్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడారు.
చెరుకు సుధాకర్ ఉద్యమ నాయకుడని, ఆయనకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని చెప్పారు. అంతే కాకుండా డాక్టర్ తో పాటు పార్టీలో చేరిన వారిని కూడా గుర్తిస్తామని వెల్లడించారు.
Also Read : ఓటు వేయండి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి