DR Vaishali Reddy : పరిచయం నిజం పెళ్లి అబద్దం
కిడ్నాప్ బాధితురాలు వైశాలీ రెడ్డి
DR Vaishali Reddy : రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించిన డెంటల్ డాక్టర్ వైశాలీ రెడ్డి(DR Vaishali Reddy) వ్యవహారం రోజు రోజుకు మలుపులు తిరుగుతోంది. కిడ్నాప్ చెర నుండి క్షేమంగా బయట పడిన బాధితురాలు నోరు విప్పింది. మిస్టర్ టీ ఫౌండర్ నవీన్ రెడ్డి తన పట్ల చెప్పినవన్నీ అబద్దాలేనని వాపోయింది. అతడితో పరిచయం ఉన్నమాట వాస్తవమేనని కానీ పెళ్లి జరిగింది అన్నది మాత్రం అబద్దమని స్పష్టం చేసింది.
తన పట్ల సైకో లాగా వ్యవహరించాడని వాపోయింది. నవీన్ రెడ్డి అంటే తనకు ఇష్టం లేదని పలుమార్లు తనతో చెప్పానని అయినా వినిపించు కోలేదని కన్నీటి పర్యంతమైంది. చాలాసార్లు తనను కొట్టాడని, భయంగా ఉందని పేర్కొంది. అతడు బయట చెప్పినవన్నీ అబద్దాలేనని , అవన్నీ బక్వాస్ అని కొట్టి పారేసింది.
అంతే కాదు తనను నిత్యం బెదిరింపులకు గురి చేశాడని ఆరోపించింది డాక్టర్ వైశాలీ రెడ్డి(DR Vaishali Reddy). తన పేరుతో ఫేక్ ఇన్ స్టా గ్రామ్ ఖాతా ఓపెన్ చేశాడని ఆరోపించింది. తన ఫోటోలు మార్ఫింగ్ కూడా చేశాడని ఆవేదన చెందింది. ఎక్కువ మాట్లాడితే తన తండ్రిని చంపేస్తానంటూ బెదిరించాడంటూ వాపోయింది బాధితురాలు.
ఇప్పటికీ నవీన్ రెడ్డి అంటే తనకు భయంగా ఉందని, తనకు భద్రత ఇప్పించాలని కోరింది. ఇదిలా ఉండగా గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ సీరియస్ అయ్యింది. బాధితురాలి పట్ల నీచంగా వ్యవహరించిన నవీన్ రెడ్డిని, అతడి గ్యాంగ్ ను వెంటనే అరెస్ట్ చేసి చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
ఇందుకు సంబంధించి నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది.
Also Read : నవీన్ రెడ్డి దారుణం పెళ్లి అబద్దం