PM Modi : రైల్వేల ఆధునీక‌ర‌ణ‌కు పెట్టుబ‌డులు

రాబోయే ఎనిమిదేళ్ల‌లో ప్ర‌గ‌తి

PM Modi : రాబోయే ఎనిమిది సంవ‌త్స‌రాల‌లో భార‌తీయ రైల్వేలు ఆధునీక‌ర‌ణ స్థితికి చేరుకుంటాయ‌న్నారు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ. శుక్ర‌వారం త‌న త‌ల్లి హీరా బెన్ అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించారు. ఇవాళ ప‌శ్చి మ బెంగాల్ లో పాల్గొనాల్సి ఉంది. అనివార్య కార‌ణాల వ‌ల్ల తాను రాలేక పోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

ఇందులో భాగంగా ఆయ‌న గుజ‌రాత్ లోని అహ్మ‌దాబాద్ నుంచే వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా హౌరా రైల్వే స్టేష‌న్ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ఇదిలా ఉండ‌గా అంత‌కు ముందు కోల్ క‌తాలో భార‌తీయ రైల్వేకు చెందిన ప‌లు ప్రాజెక్టుల‌ను ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మానికి భౌతికంగా హాజ‌రు కాలేక పోయినందుకు క్ష‌మాప‌ణ‌లు కోరుతున్న‌ట్లు తెలిపారు ప్ర‌ధాన‌మంత్రి(PM Modi).

బెంగాల్ ప్ర‌జ‌లు త‌న‌ను క్ష‌మించాల‌ని కోరారు. భార‌తీయ రైల్వేల‌ను ఆధునీక‌రించేందుకు కేంద్ర స‌ర్కార్ పెద్ద ఎత్తున పెట్టుబ‌డులు పెడుతోంద‌ని చెప్పారు న‌రేంద్ర మోదీ. ఇవాళ ప్ర‌వేశ పెట్టిన మెట్రో మార్గాలు ప‌శ్చిమ బెంగాల్ పౌరుల జీవ‌న సౌల‌భ్యాన్ని మ‌రింత మెరుగు ప‌రుస్తాయ‌ని అన్నారు.

భార‌త స్వాతంత్ర పోరాటం ప్రారంభ‌మైన ప‌విత్ర భూమి బెంగాల్ కు నేను శిర‌స్సు వంచి న‌మ‌స్క‌రిస్తున్నాను. వందేమాత‌రం నుండి ప్రారంభించి ఇవాళ వందే భార‌త్ కు చేరుకున్నామ‌ని స్ప‌ష్టం చేశారు న‌రేంద్ర మోదీ(PM Modi). రైల్వేల కోసం రికార్డు స్థాయిలో పెట్టుబ‌డులు పెడుతున్నామ‌ని తెలిపారు.

ప్ర‌స్తుతం వందే భార‌త్ ఎక్స్ ప్రెస్ , తేజ‌స్ ఎక్స్ ప్రెస్ , హంస‌ఫ‌ర్ ఎక్స్ ప్రెస్ వంటి ఆధునిక రైళ్లు భార‌త దేశంలోనే త‌యార‌వుతున్నాయ‌ని తెలిపారు ప్ర‌ధాన‌మంత్రి.

Also Read : త‌ల్లికి త‌న‌యుడి తుది వీడ్కోలు

Leave A Reply

Your Email Id will not be published!