PM Modi : పెట్టుబడిదారులకు సాదర స్వాగతం
రెడ్ టేపిజం లేదు రెడ్ కార్పెట్ తప్పా
PM Modi : పెట్టుబడిదారులకు సాదర స్వాగతం పలుకుతున్నామని అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi). రెడ్ టేపిజంకు బదులు రెడ్ కార్పెట్ పరిచామని స్పష్టం చేశారు. బుధవారం మూడు రోజుల పాటు బెంగళూరులో జరిగే ప్రపంచ పెట్టుబడిదారుల సమావేశాన్ని వర్చువల్ గా పీఎం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ప్రధానమంత్రి హాజరైన ఇన్వెస్టర్లను ఉద్దేశించి ప్రసంగించారు. తమ ప్రభుత్వం వచ్చాక ఇన్వెస్టర్లకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందన్నారు. కర్ణాటక అన్ని వర్గాల వారికి అనువైన స్థలమని పేర్కొన్నారు. ఇప్పటికే ఐటీ పరంగా ఆ రాష్ట్రానికి ఎనలేని చరిత్ర ఉందని స్పష్టం చేశారు నరేంద్ర మోదీ.
గతంలో పరిశ్రమలను ప్రారంభించాలన్నా లేదా ఇన్వెస్ట్ చేయాలంటే తీవ్రమైన ఇబ్బందులు ఉండేవని పేర్కొన్నారు. అలాంటి ఇక్కట్లు లేకుండానే తమ సర్కార్ ఫ్రీ పాలసీని తీసుకు వచ్చిందన్నారు మోదీ. చట్టాలను కూడా సమూలంగా మార్చేశామని చెప్పారు. ఒక్కసారి దరఖాస్తు చేసుకుంటే చాలు ప్రభుత్వమే అన్నీ దగ్గరుండి చూసుకుంటుందన్నారు ప్రధాన మంత్రి(PM Modi).
రక్షణ, డ్రోన్లు, అంతరిక్షం, జియో స్పేషియల్ మ్యాపింగ్ వంటి ప్రైవేట్ పెట్టుబడులకు గతంలో ఆస్కారం లేదని కానీ తాము వాటిని తొలగించడం జరిగిందన్నారు. దీని వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. పెట్టుబడిదారులకు కావాల్సిన సౌకర్యాలను కూడా అందజేస్తున్నట్లు చెప్పారు నరేంద్ర మోదీ.
గత ప్రభుత్వాలు పెట్టుబడిదారుల పట్ల కచ్చితంగా వ్యవహరించాయని ఆరోపించారు. ప్రస్తుతం ప్రపంచం సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని అయినప్పటికీ ఇన్వెస్టర్లు, నిపుణులు భారత దేశాన్ని ప్రకాశవంతమైన ప్రదేశంగా చూస్తున్నారని స్పష్టం చేశారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.
Also Read : పాలిటిక్స్ కంటే ప్రజల ప్రాణాలు ముఖ్యం