Magunta Sreenivasulu Reddy : ఢిల్లీ స్కామ్ లో ప్రమేయం అబద్దం
శ్రీనివాసులు రెడ్డి షాకింగ్ కామెంట్స్
Magunta Sreenivasulu Reddy : దేశ వ్యాప్తంగా ఢిల్లీ మద్యం స్కామ్ సంచలనం కలిగిస్తోంది. 40 చోట్ల దాడులు చేసింది కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ). రెండు తెలుగు రాష్ట్రాలలో సోదాలు చేయడం కలకలం రేపింది.
తెలంగాణలో టీఆర్ఎస్, ఏపీలో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి చెందిన ఆఫీసుల్లో దాడులు చేపట్టడం చర్చనీయాంశంగా మారింది. నిన్న ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే కేటీఆర్ , ఎంపీ సంతోష్ రావులకు చెందిన బినామీలను కూడా టార్గెట్ చేసింది ఈడీ.
కేంద్రంలోని దర్యాప్తు సంస్థలన్నీ ఇప్పుడు తెలంగాణ, తమిళనాడు, పంజాబ్ , కర్ణాటక, ఏపీ, ఢిల్లీ, తదితర నగరాలను జల్లెడ పడుతోంది.
ఇక ఈ మొత్తం వ్యవహారంలో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ చిలుక పలుకులు పలికారు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి(Magunta Sreenivasulu Reddy). ఒంగోలుకు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ఈ లిక్కర్ స్కాంలో తనకు కానీ తన ఫ్యామిలీకి గాని నయా పైసా సంబంధం లేదని స్పష్టం చేశారు. కాగా గత కొంత కాలంగా మద్యం కుంభకోణంలో తమకు రిలేషన్ ఉందంటూ వస్తున్న ప్రచారంలో, ఆరోపణలన్నీ అవాస్తవాలని కొట్టి పారేశారు ఎంపీ.
అయితే తమ వృత్తి మద్యం వ్యాపారమేనని, గత 70 ఏళ్లుగా ఇదే రంగంలో కీలకంగా ఉన్నామని స్పష్టం చేశారు. సోదాలు చేపట్టిన మాట వాస్తవమేనని , కానీ తమ ప్రమేయం ఉందని గుర్తించ లేదని పేర్కొన్నారు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి.
తన వ్యాపార ప్రయోజనాల కోసం రాజకీయ పదవులను దుర్వినియోగం ఏనాడూ చేయలేదన్నారు.
Also Read : ఏపీలో దౌడు తీస్తున్న పారిశ్రామిక రంగం