Isha Mahashivratri 2023 : ఈషా మ‌హా శివ‌రాత్రికి సిద్దం

ముమ్మ‌ర ఏర్పాట్లు చేసిన ఈషా

Isha Mahashivratri 2023 : మ‌హా శివ‌రాత్రి ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా దేశ వ్యాప్తంగా శైవ క్షేత్రాలు అంగ‌రంగ వైభ‌వంగా సిద్ద‌మ‌య్యాయి. శ‌నివారం ప్ర‌పంచ వ్యాప్తంగా అత్యంత ప్రాముఖ్య‌త క‌లిగిన గురువుగా పేరొందారు స‌ద్గురు జ‌గ్గీ వాసుదేవ‌న్. ప్ర‌తి శివ‌రాత్రి రోజు ఈషా ఫౌండేష‌న్ ఆధ్వ‌ర్యంలో త‌మిళ‌నాడు లోని కోయంబ‌త్తూరులో ఘ‌నంగా న‌భూతో న‌భ‌విష్య‌త్ అన్న రీతిలో శివ రాత్రి ఉత్స‌వాల‌ను నిర్వ‌హిస్తూ వ‌స్తుండ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది.

ఇందులో భాగంగా సంగీతం, ధ్యానం, నృత్యాల‌తో శివ రాత్రి నిండి పోతుంది. ఇప్ప‌టికే ఈషా ఫౌండేష‌న్ ఏర్పాట్లు చేసింది. ప్ర‌పంచం న‌లు మూల‌ల నుంచి ఇక్క‌డికి చేరుకుంటున్నారు భ‌క్తులు, వివిధ రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు.

ఈ కార్య‌క్ర‌మంలో స‌ద్గురు జ‌గ్గీ వాసు దేవ‌న్ ధ్యాన సెష‌న్ ను నిర్వ‌హిస్తారు. వేలాది మంది ఈ ప్ర‌త్య‌క్షంగా పాల్గొని దైవానుభూతిని పొందుతారు. ఫిబ్ర‌వ‌రి 18 మ‌హా శివ‌రాత్రికి ఈషా మందిరం దేదీప్య‌మానంగా వెలుగుతోంది. ఈషా మ‌హా శివ రాత్రి 2023(Isha Mahashivratri 2023) పేరుతో భారీ కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టారు. ఈశా యోగా కేంద్రం దీనిని ప‌ర్య‌వేక్షిస్తోంది.

ఈ బిగ్ ఈవెంట్ 12 గంట‌ల‌కు పైగా కొన‌సాగుతుంది. శ‌నివారం సాయంత్రం 6 గంట‌ల‌కు ప్రారంభ‌మై ఆదివారం 6 గంట‌ల వ‌ర‌కు కొన‌సాగుతుంది. దేశంలో పేరొందిన క‌ళాకారులు, గాయ‌నీ గాయ‌కులు ప్ర‌ద‌ర్శ‌న‌లో పాల్గొంటారు.

భ‌క్తుల‌ను త‌మ ఆట పాట‌ల‌తో అల‌రించ‌నున్నారు. గ‌త ఏడాతి మంగ్లీ, కైలాష్ ఖేర్ ప్రధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు. ఇక ఈషా మ‌హా శివ‌రాత్రి 16 భాష్లో ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తారు. దేశంలోని అన్ని ప్ర‌ధాన టెలివిజ‌న్ నెట్ వ‌ర్క్ ల‌లో టెలికాస్ట్ అవుతుంది.

Also Read : వెరీ స్పెష‌ల్ ‘భోళా శంక‌రుడు’ వైర‌ల్

Leave A Reply

Your Email Id will not be published!