Punjab Rocket Attack : రాకెట్ దాడిలో పాక్ టెర్రరిస్ట్ ప్రమేయం
ప్రకటించిన పంజాబ్ పోలీసులు
Punjab Rocket Attack : దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది పంజాబ్ ఇంటెలిజెన్స్ హెడ్ క్వార్టర్స్ పై రాకెట్ దాడి జరిగింది. ఈ దాడి కలకలం రేపింది. పంజాబ్(Punjab Rocket Attack) లోని మొహాలీలోని ఇంటెలిజెన్స్ హెడ్ క్వార్టర్స్ లో రాకెట్ తో నడిచే గ్రెనేడ్ లేదా ఆర్పీజీ దాడిలో కీలక కుట్రదారుడు పాకిస్తాన్ లో ఉన్న ఉగ్రవాదికి సన్నిహితుడని రాష్ట్ర పోలీస్ అధికారి శుక్రవారం వెల్లడించారు.
కీలక కుట్రదారు లఖ్భీర్ సింగ్ లాండా అని చెప్పారు. అతను తర్న్ తరణ్ నివాసి. అతను ఓ గ్యాంగ్ స్టర్. సింగ్ లాండ్ 2017లో కెనడాకు షిఫ్ట్ అయ్యాడు.
అతను పాకిస్తాన్ లోని ఉన్న ఉగ్రవాది హరీందర్ సింగ్ రిండాకు సన్నిహితుడని వెల్లడించారు. ఈ విషయాన్ని పంజాబ్ డైరెక్టర్ జనరల్ (డీజీపీ) వీకే భవ్రా ఇవాళ మీడియాతో స్పష్టం చేశారు.
దాడి జరిగిన సమయంలో అధికారులు లేక పోవడం వల్ల పెద్ద ప్రాణ నష్టం తప్పిందన్నారు. సోమవారం రాత్రి 7.45 గంటలకు మొహాలీ సెక్టార్ 77లో అత్యంత రక్షిత భవనంలోని మూడవ అంతస్తులో ఆర్పీజీ కాల్పులు జరిగాయి.
దీని తర్వాత పంజాబ్ రాష్ట్ర(Punjab Rocket Attack) మంతటా రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు పంజాబ్ సీఎం భగవంత్ మాన్.
వెంటనే నివేదిక సమర్పించాలని స్పష్టం చేశారు.
ఇదే సమయంలో రాష్ట్రాన్ని అతలాకుతలం చేయాలని చూస్తే తీవ్ర చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇదిలా ఉండగా ఉగ్రవాద సంస్థ బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ (బీకేఐ) , గ్యాంగ్ స్టర్ లఖ్ బీర్ సింగ్ లాండా పాకిస్తాన్ గూఢచారి సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) మద్దతుతో దాడికి ప్లాన్ చేసినట్లు భవ్రా తెలిపారు.
Also Read : మోదీ ప్రభుత్వం దేశానికి ప్రమాదం