Israel PM : మ‌ధ్య వ‌ర్తిత్వానికి ఇజ్రాయెల్ రెడీ

ఉక్రెయిన్..ర‌ష్యా ల మ‌ధ్య స‌యోధ్య

Israel PM : ఉక్రెయిన్ పై ర‌ష్యా త‌న దాడుల‌ను మ‌రింత ముమ్మ‌రం చేసింది. ఓ వైపు వాటిక‌న్ సిటీ క్యాథ‌లిక్ చ‌ర్చ్ పోప్ ఫ్రాన్సిస్ సైతం యుద్దాన్ని ఆపాల‌ని కోరారు.

అవ‌స‌ర‌మైతే తాను కూడా మాస్కోకు వ‌స్తాన‌ని ప్ర‌క‌టించాడు. ఇందుకు ఎలాంటి ప్రోటోకాల్ త‌న‌కు అవ‌స‌రం లేద‌ని స్ప‌ష్టం చేశాడు. అక్క‌డ ర‌క్తం, క‌న్నీళ్లు క‌లిసి ప్ర‌వ‌హిస్తున్నాయంటూ వాపోయాడు.

ఓ వైపు ఐక్య రాజ్య స‌మితి ఇంకో వైపు యూరోపియ‌న్ దేశాలు, అమెరికా, బ్రిట‌న్, ఫ్రాన్స్ ఇలా చెప్పుకుంటూ ప్ర‌పంచంలో ఒక్క రెండు మూడు దేశాలు త‌ప్ప అన్నీ ఉక్రెయిన్ పై దాడుల‌ను ఆపాల‌ని కోరుతున్నాయి.

కానీ వాటినేవీ బేఖాత‌ర్ చేయ‌డం లేదు ర‌ష్యా చీఫ పుతిన్. పూర్తిగా ఆర్మీ లొంగి పోయేంత దాకా తాము యుద్దాన్ని విర‌మించ‌బోమంటూ ప్ర‌క‌ట‌న చేశాడు. ఈ త‌రుణంలో ఏ దేశ‌మూ మ‌ధ్య‌వ‌ర్తిత్వం వ‌హించేందుకు ముందుకు వ‌చ్చేందుకు సాహసించ‌డం లేదు.

ఇది యుద్దం కాద‌ని సైనిక చ‌ర్య మాత్ర‌మేన‌ని ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన పుతిన్ ఇంకో దేశం వ‌స్తే అంతు చూస్తాన‌ని ప్ర‌క‌టించాడు. దీంతో అమెరికా సైతం వెనుక నుంచి మాట్లాడుతోందే త‌ప్పా ప్ర‌త్య‌క్ష పోరాటానికి ఉక్రెయిన్ కోసం రావ‌డం లేదు.

ఇక్క‌డే ఒక్క భార‌త దేశం త‌ప్ప ఏ దేశ‌మూ ర‌ష్యాతో మాట్లాడేందుకు ప్ర‌య‌త్నించ‌డం లేదు. ఇవాల్టితో 11 రోజులైంది ఇంకా యుద్దం కొన‌సాగుతూనే ఉన్న‌ది. బాంబుల మోత మోగుతూనే ఉంది.

ఇదిలా ఉండ‌గా తాను ప్రాణాలు కోల్పోయేందుకు సిద్దంగా ఉన్నాన‌ని కానీ లొంగి పోయే ప్ర‌స‌క్తి లేద‌ని అంటున్నారు ఉక్రెయిన్ చీఫ్ జెలెన్ స్కీ. ఈ త‌రుణంలో ఇజ్రాయెల్(Israel PM) మ‌ధ్య వ‌ర్తిత్వం వ‌హించేందుకు ముందుకు వ‌చ్చిన‌ట్లు స‌మాచారం.

Also Read : 11 వేల మంది ర‌ష్య‌న్ సైనికులు ఖ‌తం

Leave A Reply

Your Email Id will not be published!