ISRO Chairman : ఇస్రో చైర్మ‌న్..టీం సంబురం

డ్యాన్సుల‌తో సెల‌బ్రేష‌న్స్

ISRO Chairman : ఇస్రో చేప‌ట్టిన చంద్ర‌యాన్ -3 ప్ర‌యోగం స‌క్సెస్ అయ్యింది. దీంతో యావ‌త్ భార‌త దేశ‌మంతా సంబురాల‌లో మునిగి పోయింది. సాయంత్రం 6.04 గంట‌ల‌కు చంద్రుడి వ‌ద్ద‌కు చేరింది. దీనికి సంబంధించిన ఫోటోను పంపింది.

ఇక విజ‌య‌వంతంగా ల్యాండింగ్ చేయడంతో ఇస్రోలో సంబురాలు మిన్నంటాయి. ఇస్రో చైర్మ‌న్ సోమ‌నాథ్(Somanath) , ఆయ‌న టీం స‌భ్యులు పెద్ద ఎత్తున కేక‌లు వేశారు. ఆపై డ్యాన్సుల‌తో హోరెత్తించారు. మొత్తంగా అక్క‌డి వాతావ‌ర‌ణం చిన్న పిల్ల‌ల ఆనందాల్ని త‌ల‌పింప చేసేలా చేసింది.

ISRO Chairman Happiness

ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం నెట్టింట్లో వైర‌ల్ గా మారింది. ఆయ‌న ఎంతో సంతోషానికి లోన‌య్యారు. ఎంతో క‌ష్ట‌ప‌డి భారీ ఖ‌ర్చుతో చంద్ర‌యాన్ -3ను త‌యారు చేశారు. ఇవాళ స‌క్సెస్ ఫుల్ కావ‌డంతో ఆనందానికి అంతు లేకుండా పోయింది.

ఇదిలా ఉండ‌గా ఇప్ప‌టి వ‌ర‌కు చంద్రుడి వ‌ద్ద‌కు చేరిన వాటిలో చైనా, అమెరికా, ర‌ష్యా మాత్ర‌మే ఉన్నాయి. ప్ర‌స్తుతం భారత దేశం కూడా ఆ దేశాల స‌ర‌స‌న చేరి పోయింది. దీంతో దాయాది దేశం పాకిస్తాన్ తో పాటు ప్ర‌పంచ వ్యాప్తంగా ఇత‌ర దేశాలు సైతం భార‌తీయ శాస్త్ర‌వేత్త‌ల కృషిని చూసి విస్తు పోయారు.

Also Read : AP CM YS Jagan Comment : జ‌గ‌న్ ఫోక‌స్ స‌క్సెస్ పై న‌జ‌ర్

Leave A Reply

Your Email Id will not be published!