Shashi Tharoor : గుజరాత్ లో ఓటమిపై సంబంధం లేదు
నేను ప్రచారంలో పాల్గొన లేదన్న థరూర్
Shashi Tharoor : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, వాయనాడు ఎంపీ శశి థరూర్(Shashi Tharoor) షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన ఇప్పటికే రెబల్ నాయకుడిగా ఉన్నారు. ఇటీవల జరిగిన కాంగ్రెస్ పార్టీ చీఫ్ ఎన్నికల బరిలో నిలబడ్డారు. మల్లికార్జున్ ఖర్గే చేతిలో ఓటమి పాలయ్యారు.
ఇదిలా ఉండగా గుజరాత్ ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్లను 40 మందిని వేసింది కాంగ్రెస్ పార్టీ. ఇద్దరు ముగ్గురు నాయకులు మినహా ఏ ఒక్కరు గుజరాత్ ను సీరియస్ గా పట్టించుకున్న దాఖలాలు కనిపించ లేదు. విచిత్రం ఏమిటంటే ఆ జాబితాలో శశి థరూర్ పేరు లేక పోవడం విస్తు పోయేలా చేసింది.
ఇక రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ఒక్కడే అన్నీ తానై కష్ట పడ్డారు. చివరకు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే గుజరాత్ కు వెళ్లి ప్రధాన మంత్రిని రావణాసురుడితో పోల్చారు. చివరకు ఆయన చేసిన వ్యాఖ్యలు నరేంద్ర మోదీకి ప్లస్ అయ్యాయి. మరో వైపు కాంగ్రెస్ కు మైనస్ గా మారాయి.
ఇదే విషయాన్ని దివంగత నేత అహ్మద్ పటేల్ కూతురు కూడా షాకింగ్ కామెంట్స్ చేసింది ఖర్గేపై. ఇదిలా ఉండగా గుజరాత్ లో ఇవాళ వెలువడిన ఎన్నికల ఫలితాల్లో రికార్డు స్థాయిలో బీజేపీ అత్యధిక సీట్లను కైవసం చేసుకునే దిశగా వెళుతోంది. గురువారం శశి థరూర్(Shashi Tharoor) జాతీయ మీడియాతో మాట్లాడారు.
తాను గుజరాత్ కు వెళ్లలేదని తనకు ఆ పార్టీ ఓటమితో సంబంధం లేదన్నారు. ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు పార్టీలో కలకలం రేపుతున్నాయి. మరో వైపు హిమాచల్ ప్రదేశ్ లో బీజేపీ వ్యతిరేక ఓటు తమకు లాభం చేకూర్చేలా చేసిందన్నారు శశి థరూర్.
Also Read : ‘హిమాచల్’ లో హస్తం ముందంజ