హైదరాబాద్ : తెలుగు సినిమాలు పరిమాణానికి, ఆత్మకు మధ్య సమతుల్యతను పాటిస్తాయని అన్నారు ప్రముఖ నటి మాధురీ దీక్షిత్.ఈ గౌరవానికి గాను ఆమె తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. తెలుగు సినిమా దిగ్గజాలు, ఐకాన్ల మధ్య ఇక్కడ ఉండటం ఆనందంగా ఉందన్నారు. గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్‌లో తన ఆత్మీయమైన, ఉల్లాస భరితమైన ప్రారంభంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. నమస్తే హైదరాబాద్, అందరూ బాగున్నారా తెలుగులో నాకు తెలిసింది ఇంతే అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఆమె చిరునవ్వు నవ్వి, ఆ తర్వాత ఆంగ్లంలోకి మారి సభికులను ఉద్దేశించి మాట్లాడారు. అపారమైన ప్రతిభావంతుల మధ్య ఇక్కడ ఉండటం నాకు ఆనందంగా ఉందన్నారు నటి.
భావోద్వేగ లోతును నిలుపుకుంటూ, కథలను భారీ స్థాయిలో చెప్పడాన్ని ఆమె పరిశ్రమను ప్రశంసించారు. వారు కథలను అద్భుతంగా చెబుతారు, అయినప్పటికీ అవి చాలా వ్యక్తిగతంగా, మనకు దగ్గరగా అనిపిస్తాయి అని ఆమె జోడించారు. ఈ పరిశ్రమ తన సాంస్కృతిక మూలాలను నిలుపుకుంటూ నిరంతరం అభివృద్ధి చెందుతూ, తన పరిధులను విస్తరిస్తోందని మాధురి దీక్షిత్ పేర్కొన్నారు. తెలుగు సినిమా దిగ్గజాలు, ఐకాన్ల మధ్య ఇక్కడ ఉండటం మరింత సంతోషం కలిగించిందిని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ తారల నుంచి కూడా అభినందన సందేశాలు వెల్లువెత్తాయి. గద్దర్ ఫిల్మ్ అవార్డులను ఏర్పాటు చేసినందుకు తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశంసిస్తూ అనిల్ కపూర్, బాబీ డియోల్ వీడియో సందేశాలు పంపారు.
‘హరి హర వీర మల్లు’ తెలుగు చిత్రంలో భాగమైన బాబీ డియోల్, విజేతలకు తన శుభాకాంక్షలు తెలిపారు. బాలీవుడ్ జంట రితేష్ దేశ్‌ముఖ్, జెనీలియా డిసౌజా కూడా ఈ కార్యక్రమానికి హాజరై, తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు తారలతో ఆత్మీయంగా ముచ్చటించారు.
