IMF Chief Economist : జి-20కి నేతృత్వం భార‌త్ కు క‌ష్టం

ఐఎంఎఫ్ ప్ర‌ధాన ఆర్థిక‌వేత్త వార్నింగ్

IMF Chief Economist : త్వ‌ర‌లోనే జి-20కి భార‌త దేశం ప్రాతినిధ్యం వ‌హిస్తోంది. ఈ సంద‌ర్భంగా ఇంట‌ర్నేష‌న‌ల్ మానిట‌రింగ్ ఫండ్ – అంత‌ర్జాతీయ ద్ర‌వ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) ప్ర‌ధాన ఆర్థిక వేత్త పియ‌రీ ఒలివియ‌ర్ గౌరించాస్ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఆర్థిక ప‌రంగా దేశాల‌న్నీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయ‌ని పేర్కొన్నారు.

ప్ర‌పంచ ఆర్థిక వ్య‌వ‌స్థ‌లో మెజారిటీకి ప్రాతినిధ్యం వ‌హించే పాల‌న ఏకైక ప్ర‌దేశం స‌మూహ‌మ‌ని తెలిపారు. ప్ర‌ధానంగా ఎదుర‌వుతున్న స‌వాళ్ల‌ను ఎదుర్కోవ‌డం భార‌త్ కు అత్యంత క‌ష్ట‌మైనప‌ని అని హెచ్చ‌రించారు ఐఎంఎఫ్ ప్ర‌ధాన ఆర్థిక వేత్త‌(IMF Chief Economist). వ‌చ్చే ఏడాది 2023లో జి-20 అధ్య‌క్ష ప‌ద‌విని చేప‌ట్ట‌నుంది భార‌త్.

ప్ర‌పంచం ఎదుర్కొంటున్న కొన్ని కీల‌క స‌వాళ్ల‌పై దేశాల‌ను ఏక‌తాటి పైకి తీసుకు రావ‌డం చాలా క‌ష్ట‌మైన ప‌ని అని పేర్కొన్నారు. ప్ర‌స్తుతం జి20కి ఉన్న స‌వాళ్ల‌లో ప్ర‌ధాన‌మైన‌ది. భౌగోళిక ఆర్థిక విచ్చిన్నం అనేది అపార‌మైన ఉద్రిక్త‌త‌ల‌ను చూశామ‌ని స్ప‌ష్టం చేశారు. ప్ర‌స్తుతం ఉక్రెయిన్ పై ర‌ష్యా దాడికి దిగ‌డం మ‌రో కార‌ణ‌మ‌ని స్ప‌ష్టం చేశారు గౌరించ‌స్.

భౌగోళిక రాజ‌కీయ ప‌రిగ‌ణ‌ల‌కు సంబంధించి తీవ్ర‌మైన ఇబ్బంది ఎదురుకాక త‌ప్ప‌ద‌న్నారు. ఒక ర‌కంగా చెప్పాలంటే జి20కి నేతృత్వం వ‌హించ‌డం భార‌త్ క‌ష్ట‌మ‌న్నారు. ఆయా దేశాలు ఎదుర్కొంటున్న వాటిపై పోక‌స్ పెట్టాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.

ముఖ్య‌మైన అంశాల‌పై పురోగ‌తి సాధించ‌డం వంటి ముఖ్య‌మైన ల‌క్ష్యాల‌లో ఒక‌టిగా తాను భావిస్తున్నాన‌ని తెలిపారు ఐఎంఎఫ్ ప్ర‌ధాన ఆర్థిక‌వేత్త‌. ద్ర‌వ్యోల్బ‌ణం కూడా ప్ర‌ధాన‌మైన స‌మ‌స్య‌గా పేర్కొన్నారు ఆర్థిక‌వేత్త‌.

Also Read : జెమిని ఎడిబుల్స్ తెలంగాణ‌లో పెట్టుబ‌డి

Leave A Reply

Your Email Id will not be published!