IT Raids : వివేక్ కు షాక్ ఐటీ రైడ్స్

చెన్నూరులో కాంగ్రెస్ అభ్య‌ర్థి

IT Raids : హైద‌రాబాద్ – మాజీ ఎంపీ, ప్ర‌స్తుతం చెన్నూరు నియోజ‌క‌వ‌ర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థిగా బ‌రిలో ఉన్న వీ6 న్యూస్ ఛానెల్ , విశాఖ ఇండ‌స్ట్రీస్ చైర్మ‌న్ గ‌డ్డం వివేక్ వెంక‌టస్వామికి కోలుకోలేని షాక్ త‌గిలింది. ఇప్ప‌టికే ఆయ‌న‌కు చెందిన‌ట్లుగా భావిస్తున్న కోట్ల రూపాయ‌ల‌ను పోలీసులు సీజ్ చేశారు. వాటిని స్వాధీనం చేసుకుని ఈసీకి అప్ప‌గించారు.

IT Raids on Gaddam Vivek

తాజాగా కోలుకోలేని షాక్ త‌గిలింది. ఆయ‌న‌కు సంబంధించిన ఇళ్లు, కార్యాల‌యాల‌పై విస్తృతంగా ఆదాయ పన్ను శాఖ దాడులు చేప‌ట్టింది. మంగ‌ళ‌వారం ఉద‌యం నుంచే ప‌లు చోట్ల ఏక కాలంలో ఐటీ బృందాలు దాడుల‌కు దిగాయి.

సోదాల‌లో భాగంగా హైద‌రాబాద్ లోని సోమాజి గూడ‌, మంచిర్యాల లోని గడ్డం వివేక్ వెంక‌ట స్వామి(Gaddam Vivek) నివాసాల‌లో దాడులు చేప‌ట్టింది ఐటీ. ఏక కాలంలో 20 చోట్ల సోదాలు చేప‌ట్ట‌డం క‌ల‌క‌లం రేపుతోంది. ఇదిలా ఉండ‌గా బీజేపీకి, బీఆర్ఎస్ పార్టీల‌కు చెందిన నేత‌లు ఎన్నిక‌ల బ‌రిలో ఉన్న‌ప్ప‌టికీ ఇప్ప‌టి వ‌ర‌కు వారికి చెందిన ఇళ్ల‌ల్లో దాడులు జ‌ర‌గ‌క పోవ‌డాన్ని కాంగ్రెస్ పార్టీ త‌ప్పు ప‌ట్టింది.

ఇదిలా ఉండ‌గా గ‌డ్డం వివేక్ వెంక‌ట స్వామి గ‌తంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఎంపీగా ప‌ని చేశారు. అక్క‌డి నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి జంప్ అయ్యారు. అక్క‌డ ఇముడ లేక భార‌తీయ జ‌న‌తా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక్క‌డ స‌రిప‌డ‌క తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. మొత్తంగా వివేక్ ఏ పార్టీలో ఉంటార‌నేది ఎవ‌రూ చెప్ప‌లేక పోతున్నారు.

Also Read : Harish Rao : ఈట‌ల ప‌త‌నం ఖాయం

Leave A Reply

Your Email Id will not be published!