IT Raids Excel Group : ఎక్సెల్ గ్రూప్ కంపెనీపై ఐటీ దాడులు
పలు చోట్ల కొనసాగుతున్న సోదాలు
IT Raids Excel Group : ఆదాయ పన్ను శాఖ (ఐటీ) దాడులు కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే పలు కంపెనీలకు కోలుకోలేని షాక్ ఇచ్చిన ఐటీ తాజాగా హైదరాబాద్ లోని ప్రముఖ కంపెనీ ఎక్సెల్ గ్రూప్ ఆప్ కంపెనీపై బుధవారం ఉదయం నుంచే దాడులకు దిగింది. మరో వైపు మంత్రి మల్లారెడ్డికి సంబంధించిన ఆస్తులు, ఇళ్లు, కుటుంబీకుల ను కూడా ప్రశ్నించింది.
పలు కీలకమైన పత్రాలను స్వాధీనం చేసుకుంది. ప్రస్తుతం ఎక్సెల్ గ్రూప్ పై దాడికి దిగడం విస్తు పోయేలా చేసింది. ఈ ఎక్సెల్ గ్రూప్ ఆఫ్ కంపెనీలకు సంబంధించి ఏకంగా 18 చోట్ల సోదాలు(IT Raids Excel Group) చేపట్టింది ఐటీ. దాడుల్లో భాగంగా హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో ఉన్న ఎక్సెల్ గ్రూప్ ఆఫీసులో సోదాలు చేపట్టారు ఐటీ అధికారులు. దేశ వ్యాప్తంగా ఈ దాడులు కొనసాగుతున్నాయి.
ప్రధానంగా ఎక్సెల్ గ్రూప్ కు సంబంధించి ప్రధాన కార్యాలయం తమిళనాడు లోని చెన్నైలో ఉంది. అక్కడి నుంచే కేరాఫ్ గా అన్ని కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ఏకకాలంలో దేశంలోని పలు చోట్ల దాడులకు దిగడం కలకలం రేపింది. ఐటీ దాడుల దెబ్బకు మిగతా కంపెనీలు అలర్ట్ అయ్యాయి. ఇప్పుడు ఐటీ, సీబీఐ, ఈడీ ఏ టైంలో దాడులు చేస్తాయో ఎవరూ చెప్పలేని పరిస్థితి నెలకొంది.
సోదాలలో భాగంగా ప్రస్తుతం జరుపుతున్న లావాదేవీలు, గతంలో ఏమేం చేశారనే దానిపై ఐటీ ఆఫీసర్లు ఆరా తీస్తున్నారు. గతంలో ఎక్సెల్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కు సంబంధించి ఐటీ పరంగా అవకతవకలు జరిగినట్లు సమాచారం. ఆ కారణంగానే ఐటీ దాడులకు దిగిందని టాక్.
Also Read : రద్దు తర్వాత పెరిగిన నోట్ల చలామణి