IT Raids Maganti Gopinath : మాగంటి ఇంట్లో ఐటీ సోదాలు
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేకు బిగ్ షాక్
IT Raids Maganti Gopinath : హైదరాబాద్ – అధికార భారత రాష్ట్ర సమితి పార్టీకి చెందిన జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కు బిగ్ షాక్ తగిలింది. గురువారం మూకుమ్మడిగా ఇన్ కం ట్యాక్స్ అధికారులు దాడి చేశారు. ఆయనకు చెందిన బంధువులు, స్నేహితుల ఇళ్లలోనూ ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి.
అంతే కాకుండా ఎమ్మెల్యేకు చెందిన పూజా కృష్ణ, జీవన్ శక్తి, ఈకామ్ చిట్ ఫండ్స్ , కూకట్ పల్లిలోని ఇందు ఫార్చూన్ ఫీల్డ్స్ లో సైతం ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. దీనిపై స్పందించేందుకు ఎమ్మెల్యే నిరాకరించారు.
IT Raids Maganti Gopinath Viral
త్వరలో తెలంగాణలో ఎన్నికలు జరగ బోతున్నాయి. దీంతో ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. ప్రస్తుతం బీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. కావాలని దాడి చేశారా లేక తమ వృత్తికి సంబంధించిన విధుల్లో భాగంగా ఐటీ రంగంలోకి దిగిందా అన్నది తేలాల్సి ఉంది.
అయితే క్లారిటీ రావాలంటే ఇంకా కొంత సమయంలో పట్టేలా ఉంది. సోదాలు జరుగుతున్న సమయంలో ఎవరినీ బయటకు వెళ్లకుండా నిలిపి వేశారు ఐటీ అధికారులు. వారి వద్ద నుంచి ఫోన్లు తీసుకున్నారు. మొత్తంగా మాగుంట గోపీనాథ్(Maganti Gopinath) పై ఐటీ దాడులు చేయడంతో మిగతా ఎమ్మెల్యేలలో టెన్షన్ నెలకొంది.
Also Read : BRS Slams : హస్తం..కమలం రెండూ ఒక్కటే
