IT Raids : గుర్తింపు లేని పార్టీల నిధుల‌పై ఐటీ దాడులు

ప‌లు రాష్ట్రాల‌లో విస్తృతంగా సోదాలు

IT Raids :  దేశ వ్యాప్తంగా ఐటీ దాడులు క‌ల‌క‌లం రేపుతున్నాయి. బుధ‌వారం గుర్తింపు లేని రాజ‌కీయ పార్టీలు, నిధుల‌పై పాన్ ఇండియా ఆదాయ‌పు ప‌న్ను దాడులు చేప‌ట్టింది.

ఇందులో భాగంగా గుజ‌రాత్, ఢిల్లీ, ఉత్త‌ర ప్ర‌దేశ్ , మ‌హారాష్ట్ర‌, హ‌ర్యానాతో పాటు మ‌రికొన్ని రాష్ట్రాల‌లో సోదాలు నిర్వ‌హిస్తోంది. న‌మోదిత గుర్తింపు లేని రాజ‌కీయ పార్టీలు , వాటి అనుబంధ సంస్థ‌ల‌పై ఆదాయ‌పు ప‌న్ను శాఖ దాడుల‌కు(IT Raids) దిగ‌డం చ‌ర్చ‌కు దారితీసింది.

ఇదిలా ఉండ‌గా న‌మోదిత గుర్తింపు లేని రాజ‌కీయ పార్టీలు (ఆర్ యుపీపీ) పై ప‌న్ను ఎగ‌వేత విచార‌ణ‌లో భాగంగా ఇన్ కం ట్యాక్స్ శాఖ సోదాలకు దిగింది. కాగా ఆయా పార్టీల‌కు అనుమాన‌స్ప‌ద‌మైన రీతిలో నిధులు స‌మ‌కూర్చాయ‌ని అధికారిక వ‌ర్గాలు తెలిపాయి.

న‌మోదిత గుర్తింపు లేనటువంటి రాజ‌కీయ పార్టీలు, వాటి అనుబంధ సంస్థ‌లు, ఆప‌రేట‌ర్లు, ఇత‌రుల‌పై ఆదాయ ప‌న్ను శాఖ స‌మ‌న్వ‌య చ‌ర్య ప్రారంభించింద‌ని తెలిపాయి.

ఆయా పార్టీల‌కు సంబంధించి విస్తృతంగా త‌నిఖీలు చేప‌ట్టాక‌, రిజ‌స్ట‌ర్డ్ గుర్తింపున‌కు నోచుకోని రాజ‌కీయ పార్టీల జాబితా నుండి ఇటీవ‌ల 87 ఎన్నిక‌ల క‌మిష‌న్ సిఫార‌సు మేర‌కు ఐటీ శాఖ రంగంలోకి దిగింది.

ద్ర‌వ్య విరాళాల దాఖ‌ల‌కు సంబంధించిన నిబంధ‌న‌ల‌ను , ఎన్నిక‌ల చ‌ట్టాల‌ను ఉల్లంఘించినందుకు , వారి చిరునామా, ఆఫీస్ బేర‌ర్ల పేర్ల‌ను అప్ డేట్ చేయ‌డంలో విఫ‌ల‌మైన‌ట్లు గుర్తించింది.

దాదాపు దేశ వ్యాప్తంగా 2,100 కు పైగా గురింపున‌కు నోచుకోని రాజ‌కీయ పార్టీలు ఉన్న‌ట్లు తెలిపింది. దీంతో ఆయా పార్టీల‌లో క‌ల‌క‌లం రేగింది ఐటీ దాడుల నేప‌థ్యంలో.

Also Read : బెంగాల్ మంత్రి ఇళ్ల‌పై సీబీఐ దాడులు

Leave A Reply

Your Email Id will not be published!