IT Raids : ఆదాయ పన్ను శాఖ ఢిల్లీ , హర్యానా లోని ఫార్మాస్యూటికల్ గ్రూపు ఆవరణలో శుక్రవారం సోదాలు(IT Raids) చేపట్టింది. పెద్ద సంఖ్యలో నేరారోపణ పత్రాలు, డిజిటల్ డేటాను స్వాధీనం చేసుకుంది.
జూన్ 29న ఢిల్లీ – ఎన్సీఆర్ , హర్యానా లోని 25 ప్రాంగణాల్లో సెర్చ్ ఆపరేషన్ జరిగింది. ఈ ఐటీ దాడుల్లో రూ. 8 కోట్ల విలువైన నగదు, ఆస్తులను స్వాధీనం చేసుకుంది.
ఆదాయ పన్ను శాఖ ప్రకారం నగదు రూపంలో ఫార్మాస్యూటికల్ ఔషధాల భారీ లెక్కలు చచూపని విక్రయాలకు పాల్పడినట్లు గుర్తించింది.
పెద్ద సంఖ్యలో కొనుగోళ్లు, వేతనాల చెల్లింపులు, ఇతర ఖర్చులు కూడా నగదు రూపంలోనే జరిగినట్లు వెల్లడైంది. సదరు ఫార్మా సంస్థ ఆఫ్గనిస్తాన్ కు ఔషధాలను విక్రయించినందుకు హవాలా ద్వారా నగదు రసీదులతో సహా, ఔషధాలను విక్రయించింది ఫార్మా సంస్థ.
ఇందులో ఒకరు కీలకంగా వ్యవహరించినట్లు గుర్తించింది ఆదాయ పన్ను శాఖ. సంస్థకు సంబంధించిన డేటాను కూడా స్వాధీనం చేసుకుంది ఐటీ శాఖ.
ఇదిలా ఉండగా హవాలా నగదు రసీదుల మొత్తం సుమారు రూ. 25 కోట్లుగా ఉందని గుర్తించింది. యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రిడియంట్స్ (ఏపీఐ)లో వ్యవహరించే ఒక ఔషధ సంబంధిత విషయంలో రూ .94 కోట్ల విలువైన మిగులు స్టాక్ ఉన్నట్లు సోదాలలో వెల్లడైంది.
లెక్కలు చూపని నగదును స్థిరాస్తుల కొనుగోలులో, ఔషధాల తయారీ కేంద్రాల విస్తరణలో పెట్టుబడి పెట్టినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
మందుల విక్రయానికి సంబంధించి రశీదులు ఇవ్వకుండా నగదును ఆస్తుల కొనుగోలు పైనే ఎక్కువగా సదరు సంస్థ ఫోకస్ పెట్టినట్లు ప్రకటించి ఆదాయపన్ను శాఖ. లెక్కలు చూపని రూ. 4.2 కోట్ల నగదు(IT Raids), రూ. 4 కోట్ల విలువైన ఆభరణాలు స్వాధీనం చేసుకుంది.
Also Read : ముంబై మాజీ పోలీస్ చీఫ్ పై సీబీఐ కేసు