Mamata Banerjee : మోదీ బాధలో ఉన్నారు ఏమని అడగను
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ
Mamata Banerjee : పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమె మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై. ఇది సంతాపం చెప్పాల్సిన సమయం.
ఇప్పుడు మోదీకి ఏమని చెప్పగలనని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా రాష్ట్రానికి సంబంధించి జాతీయ గ్రామీణ ఉపాధి హామీకి సంబంధించిన బకాయిలను విడుదల చేయాలని కోరుతూ పలుసార్లు లేఖలు రాశానని, అయినా ఫలితం లేక పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు మమతా బెనర్జీ(Mamata Banerjee).
గత వారం తన ప్రియమైన తల్లిని నరేంద్ర మోదీ కోల్పోయారు. ఈ సమయంలో నేను నా రాష్ట్రానికి సంబంధించిన రావాల్సిన నిధుల గురించి అడగడం మంచి పద్దతి కాదన్నారు సీఎం. ఆయన తన తల్లిని కోల్పోయి దుఖఃంలో ఉన్నారు. ఈ సమయంలో నేను ఇబ్బంది పెట్ట దల్చు కోలేదని స్పష్టం చేశారు.
ఆమె మీడియాతో మాట్లాడారు. చాలా సార్లు లేఖలు రాశాను. బకాయిలు కోట్లల్లో ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు ఒక్క పైసా కూడా మంజూరు చేయలేదన్నారు. ఎన్నోసార్లు మంజూరు కాకుండా ఆగి పోయిన విషయాన్ని స్పష్టం చేశానని తెలిపారు.
రాష్ట్రానికి వచ్చినప్పుడు, తాను ఢిల్లీకి వెళ్లి పీఎంను కలిసిన సమయంలో కూడా చెప్పానన్నారు మమతా బెనర్జీ. చివరకు లేఖలు కూడా రాయడం జరిగిందన్నారు.
కానీ పట్టించు కోలేదన్నారు. ఈ సమయంలో ఇక ఇంతకు మించి తానేమీ మాట్లాడలేనని పేర్కొన్నారు పశ్చి మ బెంగాల్ సీఎం.
Also Read : అరుణాచల్ లో రాజ్ నాథ్ సింగ్ పర్యటన