Jagadish Shettar : కన్నడ కాంగ్రెస్ లో షెట్టర్ కలకలం
పార్టీలో అసమ్మతి కుంపటి
Jagadish Shettar : కర్ణాటక – ఆరు గ్యారెంటీల హామీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి కలకలం రేపుతోంది. ఇప్పటికే ప్రజలకు ఎన్నికల సందర్బంగా ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు నానా తంటాలు పడుతోంది సిద్దరామయ్య ప్రభుత్వం.
Jagadish Shettar Issue Viral
ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న నేతలు కొందరు ఈ అసమ్మతి కుంపటి రాజేస్తున్నట్లు సమాచారం. దీంతో ముందే అప్రమత్తమైంది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. సర్కార్ ఏర్పడి ఇంకా ఆరు నెలలు గడవక ముందే చీలకల వ్యవహారం మరింత విస్తు పోయేలా చేసింది పార్టీని.
ఎలాంటి సందర్భంలో నైనా తమకు అనుకూలంగా మల్చుకునే నేపథ్యం కలిగిన , పేరు పొందిన ట్రబుల్ షూటర్, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సైతం షాక్ కు గురయ్యారు. విచిత్రం ఏమిటంటే తిరుగుబాటు జెండా ఎగుర వేసింది ఎవరో కాదు ఇటీవలే బీజేపీ నుంచి జంప్ అయిన మాజీ సీఎం , సీనియర్ కర్ణాటక కాంగ్రెస్ నాయకుడు జగదీష్ షెట్టర్(Jagadish Shettar ) కావడం ఒకింత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
గతంలో చాలా చోట్ల కాంగ్రెస్ పార్టీ పవర్ లోకి వచ్చినా ఆ పార్టీని, సర్కార్ ను చీల్చడంలో బీజేపీ సక్సెస్ అయ్యింది. దీని వెనుక ట్రబుల్ షూటర్, కేంద్ర హొం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా ఉండడం జగమంతా విదితమే. షెట్టర్ బీజేపీ మాజీ మంత్రితో భేటీ కావడంతో ముందే అప్రమత్తమైంది కాంగ్రెస్ పార్టీ.
Also Read : Rahul Priyanka Visit : శివాలయంలో అన్నా చెల్లెలు