CBI YS Jagan : వివేకా హ‌త్య జ‌గ‌న్ కు ముందే తెలుసు

కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ సీబీఐ వెల్ల‌డి

CBI YS Jagan : ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ రెడ్డికి కోలుకోలేని షాక్ త‌గిలింది. మాజీ మంత్రి, దివంగ‌త వైఎస్ వివేకానంద రెడ్డి దారుణ హ‌త్య కేసుకు సంబంధించి కీల‌క వ్యాఖ్య‌లు చేసింది కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ సీబీఐ. ఈ మేర‌కు ఈ హ‌త్య‌కు సంబంధించి ముందే స‌మాచారం సీఎంకు తెలుస‌ని సంచ‌ల‌న నిజం బ‌య‌ట పెట్టింది. కోర్టుకు స‌మ‌ర్పించిన చార్జ్ షీట్ లో దీని గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించింది.

క‌డ‌ప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి దాఖ‌లు చేసిన ముందస్తు బెయిల్ పిటిష‌న్ పై తెలంగాణ హైకోర్టుకు స‌మ‌ర్పించిన అఫిడ‌విట్ లో సీబీఐ ఈ విష‌యాలు వెల్ల‌డించింది. జ‌గ‌న్ రెడ్డికి(YS Jagan) ముందే స‌మాచారం ఎలా అందింద‌న్న దానిపై సీబీఐ ఆరా తీస్తున్న‌ట్లు తెలిపింది.

దాదాపు నాలుగు సంవ‌త్స‌రాల కింద‌ట ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఈ హ‌త్య తెలుగు రాష్ట్రాల‌లో క‌ల‌క‌లం రేపింది. వైఎస్ వివేకానంద రెడ్డి మేన‌ల్లుడు ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి బంధువు అయిన క‌డ‌ప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పాత్ర‌పై సీబీఐ విచార‌ణ జ‌రుపుతోంది.

కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో అఫిడవిట్‌లో దర్యాప్తు సంస్థ ఈ విషయాలు వెల్లడించింది. ఇదిలా ఉండ‌గా నీతి ఆయోగ్ స‌మావేశానికి హాజ‌ర‌య్యేందుకు ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ రెడ్డి ఢిల్లీలోనే ఉన్నారు. ఈ త‌రుణంలో సీబీఐ బాంబు పేల్చ‌డంతో వైసీపీ వ‌ర్గాల్లో క‌ల‌క‌లం రేపుతోంది. ప్ర‌స్తుతం సీబీఐ వెల్ల‌డించిన ఈ విష‌యంపై టీడీపీకి ప్ర‌చార అస్త్రంగా మారింది.

Also Read : Karnataka Cabinet

 

Leave A Reply

Your Email Id will not be published!