RK Roja : జ‌గ‌న్ రీల్ సింహం కాదు రియ‌ల్ సింహం

బాల‌య్య బాబుకి ఆర్కే రోజా కౌంట‌ర్

RK Roja : ఏపీలో ఎన్టీఆర్ హెల్త్ యూనివ‌ర్శిటీ పేరు మార్పు తీవ్ర గంద‌ర‌గోళానికి, ఆందోళ‌న‌ల‌కు దారి తీసింది. పేరు మారిస్తే తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని హిందూపురం ఎమ్మెల్యే, న‌టుడు నంద‌మూరి బాల‌కృష్ణ హెచ్చ‌రించారు.

దీనిపై స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చారు ఏపీ ప‌ర్యాట‌క శాఖ మంత్రి ఆర్కే రోజా(RK Roja). నీ ఫ్లూట్ లు ఇక్క‌డ ప‌ని చేయ‌వ‌న్నారు. సినిమాల‌లో చూపించే సింహాలు ఇక్క‌డ లేవ‌న్నారు.

ఇక రియ‌ల్ సింహం సీఎంగా ఉంద‌ని దానితో పెట్టుకుంటే మ‌టాషేన‌న్నారు. బాల‌కృష్ణ ఎంత త‌గ్గితే అంత మంచిద‌న్నారు. ఏ మాత్రం తేడా వ‌చ్చిన జ‌గ‌న్ వ‌దిలి పెట్ట‌డ‌ని జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సూచించారు.

ఇదిలా ఉండ‌గా ఎన్టీఆర్ పేరు మీద ఉన్న హెల్త్ యూనివ‌ర్శిటీని వైఎస్సార్ హెల్త్ యూనివ‌ర్శిటీ గా మార్చాల‌ని ఏపీ ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఈ మేర‌కు అసెంబ్లీలో తీర్మానం ప్ర‌వేశ పెట్టారు.

ఇందుకు ఓకే కూడా చెప్పారు. దీనిపై తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది టీడీపీ. ఏపీలో ఆందోళ‌న‌లు, నిర‌స‌న‌లు మిన్నంటాయి. ఎన్టీఆర్ వార‌సులు బిల్లు ఆమోదంపై తీవ్రంగా మండిప‌డుతున్నారు.

బాల‌కృష్ణ సీరియ‌స్ గా స్పందించ‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు ఆర్కే రోజా(RK Roja). మ‌రో వైపు వైసీపీ నిర్ణ‌యాన్ని జూనియ‌ర్ ఎన్టీఆర్, క‌ళ్యాణ్ రామ్ ల‌తో పాటు ప‌లువురు సినీయ‌ర్లు తీవ్రంగా వ్య‌తిరేకించారు.

ఇదిలా ఉండ‌గా బాల‌కృష్ణ స్పందిస్తూ ఎన్టీఆర్ ఒక పేరు కాదు. ఒక సంస్కృతి, నాగ‌రిక‌త‌, తెలుగు వారి ఆత్మ గౌర‌వాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా తెలియ చేసిన నాయ‌కుడు అని పేర్కొన్నారు.

Also Read : బాల‌య్య కామెంట్స్ వైసీపీ సీరియ‌స్

Leave A Reply

Your Email Id will not be published!