Jai Shankar : న్యూజిలాండ్ ప్ర‌ధానితో జై శంక‌ర్ భేటీ

ద్వైపాక్షిక సంబంధాల‌పై విస్తృత చ‌ర్చ‌లు

Jai Shankar : కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుబ్ర‌మ‌ణ్యం జై శంక‌ర్ విదేశీ ప‌ర్య‌ట‌న‌లో బిజీగా ఉన్నారు. ఇందులో భాగంగా గురువారం జై శంక‌ర్ న్యూజిలాండ్ ప్ర‌ధాన మంత్రి జ‌సిందా ఆర్డెర్న్(Jacinda Ardern) తో భేటీ అయ్యారు. భార‌త్, న్యూజిలాండ్ దేశాల మ‌ధ్య ద్వైపాక్షిక సంబంధాల‌పై విస్తృతంగా చ‌ర్చించారు.

ఇదిలా ఉండ‌గా విదేశాంగ శాఖ మంత్రిగా న్యూజిలాండ్ లో ప‌ర్య‌టించ‌డం జై శంక‌ర్ ఇదే మొద‌టిసారి. ఇరువురు నాయ‌కుడు గొప్ప వ్యాపార స‌హ‌కారాన్ని , ప్ర‌జ‌ల నుండి మార్పిడిని ప్రోత్స‌హించేందుకు అంగీక‌రించారు. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ(PM Modi) న్యూజిలాండ్ ప్ర‌ధాన‌మంత్రి జ‌సిందా ఆర్డెర్న్ కు శుభాకాంక్ష‌లు తెలిపారు.

ఈ విష‌యాన్ని జ‌సిందాకు తెలియ చేశారు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి. ఇరు దేశాలు శాంతి, సామ‌ర‌స్యాన్ని కోరుతున్నాయ‌ని పేర్కొన్నారు. మెరుగైన వ్యాపార స‌హ‌కారాన్ని, ప్ర‌జ‌ల నుండి వ్య‌క్తుల మార్పిడిని ప్రోత్స‌హించ‌డంపై అంగీక‌రించిన‌ట్లు తెలిపారు జై శంక‌ర్(Jai Shankar). ప్ర‌పంచంలో ఆర్తిక ప‌రంగా వ్యాపార‌, వాణిజ్య రంగాల‌లో కీల‌క‌మైన పాత్ర పోషిస్తూ వ‌స్తోంది భార‌త్ అని పేర్కొన్నారు.

ఈ సంద‌ర్భంగా భార‌త్ గ‌త ఎనిమిది సంవ‌త్స‌రాల పాల‌న‌లో సాధించిన విజ‌యాల గురించి తెలియ చేశారు న్యూజిలాండ్ ప్ర‌ధాన‌మంత్రికి. న్యూజిలాండ్ లో ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వ్ ను స్మ‌రించుకునేందుకు ఇరువురు నేత‌లు 75 ఏళ్ల భార‌త్ ఉత్స‌వాల‌ను ప్ర‌తిబింబించే పోస్ట‌ల్ స్టాంపును విడుద‌ల చేయ‌నున్నారు.

పోస్ట‌ల్ స్టాంపుల‌ను విడుద‌ల చేసే విష‌యాన్ని కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇవాళ ప్ర‌క‌టించింది. ఇదిలా ఉండ‌గా న్యూజిలాండ్ లో 2,50,000 మంది ప్ర‌వాస భార‌తీయులు నివ‌సిస్తున్నారు.

Also Read : శాంతికి విఘాతం కొరియా క్షిప‌ణి ప్ర‌యోగం

Leave A Reply

Your Email Id will not be published!