Ashok Gehlot : జై శ్రీరాం నినాదం సీతకు అవమానం – సీఎం
బీజేపీపై నిప్పులు చెరిగిన అశోక్ గెహ్లాట్
Ashok Gehlot : దేశంలో రాజకీయాలు మరింత వేడిని రాజేస్తున్నాయి. మాటల తూటాలు పేలుతున్నాయి. ఇదే సమయంలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్య కామెంట్స్ యుద్దం నడుస్తోంది. రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్(Ashok Gehlot) భారతీయ జనతా పార్టీపై నిప్పులు చెరిగారు. జై శ్రీరాం అంటూ నినాదాలు చేయడం వల్ల రాముడిని నమ్ముకుని ఉన్న సీతకు అన్యాయం చేశారంటూ ఎద్దేవా చేశారు.
ఒక రకంగా చెప్పాలంటే కావాలనే బీజేపీ రాముడి నుండి సీతను వేరు చేసిందంటూ ధ్వజమెత్తారు. అందుకే వారంతా జై శ్రీరాం అంటున్నారు కానీ జై సీత అని అనడం లేదు ఎందుకని అని ప్రశ్నించారు. అంటే మహిళలు మనుషులు కారా అని నిలదీశారు అశోక్ గెహ్లాట్. బీజేపీకి ముందు నుంచి విడదీయడం అలవాటేనని ఎద్దేవా చేశారు.
అందుకే వాళ్లు ఎప్పుడూ విడదీసేందుకే ఇష్ట పడతారని, అలాగే వారి చర్యలు కూడా ఉంటాయన్నారు. కానీ వాళ్లు ద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నారు. మనుషుల మధ్య అంతరాలు సృష్టించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ కలిపేందుకు ప్రయత్నం చేస్తుందన్నారు.
అందుకే దేశానికి ద్వేషం కాదు కావాల్సింది ప్రేమ అని రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టారని అన్నారు సీఎం(Ashok Gehlot). వాళ్లు ఎన్ని రకాలుగా నినాదాలు చేసినా ప్రజలు వాళ్లను నమ్మడం లేదన్నారు. జై శ్రీరాం అంటూ ప్రజల్లో ఆగ్రహాన్ని , భయాన్ని కలుగ చేస్తోందని ఆరోపించారు.
ఇలాంటి వాటిని వారు స్వీకరించరని స్పష్టం చేశారు అశోక్ గెహ్లాట్. ఇదిలా ఉండగా సీఎం ఆదివారం జైపూర్ లో 108 అంబులెన్స్ సర్వీస్ ను ప్రారంభించారు.
Also Read : ఛాందసవాద రాజకీయం ప్రమాదం