Azam Khan : ఎస్పీ నేత ఆజం ఖాన్ కు జైలు శిక్ష
ద్వేష పూరిత ప్రసంగం కేసుపై తీర్పు
Azam Khan : యూపీకి చెందిన సమాజ్ వాది పార్టీ అగ్ర నేత , ఎమ్మెల్యేగా ఉన్న ఆజం ఖాన్(Azam Khan) కు కోలుకోలేని షాక్ తగిలింది. ద్వేష పూరిత ప్రసంగం కేసులో జైలు శిక్షను ఖరారు చేసింది. ఈ కేసుకు సంబంధించి విచారణ చేపట్టిన కోర్టు ఆజం ఖాన్ ను దోషిగా తేల్చింది.
మూడు సంవత్సరాల జైలు శిక్షను విధిస్తున్నట్లు తెలిపింది. ఇదిలా ఉండగా ఇప్పటికే ఆయనపై పలు కేసులు నమోదయ్యాయి. అంతే కాకుండా ఇటీవల రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆజం ఖాన్ జైలు నుండే ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ తర్వాత గెలుపొందారు కూడా.
కానీ అడుగడుగునా తనను యోగి సర్కార్ ఇబ్బందులకు గురి చేస్తోందంటూ ఆరోపించారు. ఇక ద్వేష పూరిత ప్రసంగం కేసుకు సంబంధించి రూ. 6,000 జరిమానా విధించింది. వారం రోజుల్లో ఉన్నత కోర్టులో అప్పీలు చేసుకునేందు కోసం బెయిల్ కూడా మంజూరు చేసింది ఆజం ఖాన్ కు.
ఒకవేళ ఆజం ఖాన్ గనుక కోర్టుకు వెళ్లక పోతే తను గెలుపొందిన ఎమ్మెల్యే సీటును కోల్పోవాల్సి వస్తుంది. ఇదిలా ఉండగా 2019లో రాష్ట్రంలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, సీఎం యోగి ఆదిత్యా నాథ్ తో పాటు అప్పటి కలెక్టర్ ఆంజనేయ కుమార్ సింగ్ ను ఉద్దేశించి ఆజం ఖాన్ పరుష పదజాలం వాడారు.
దీనిని సవాల్ చేస్తూ ఆజం ఖాన్(Azam Khan) పై పిటిషన్ దాఖలైంది. ఈ మేరకు రాంపూర్ కోర్టు విచారణ చేపట్టింది. శిక్షను ఎట్టకేలకు ఖరారు చేసింది. ప్రస్తుతం సమాజ్ వాది పార్టీలో కీలకమైన నాయకుడిగా ఉన్నారు.
Also Read : బోటు ప్రమాదం నితీష్ ప్రచారానికి దూరం