Jairam Ramesh : ప్రజల దృష్టి మళ్లించేందుకు మోదీ యత్నం
కాంగ్రెస్ పార్టీ నేత జైరాం రమేష్ కామెంట్స్
Jairam Ramesh : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(Narendra Modi) తమాషాలు చేస్తున్నారంటూ నిప్పులు చెరిగింది కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ శనివారం స్పందించారు.
మోదీ తన బర్త్ డేను పురస్కరించుకుని చిరుత పులులను మధ్య ప్రదేశ్ లోని నేషనల్ పార్కులో విడుదల చేశారు. దీనిని తీవ్రంగా తప్పు పట్టారు జైరాం రమేష్.
ఓ వైపు దేశంలో సవాలక్ష సమస్యలు పేరుకు పోయాయని కానీ వాటి గురించి పట్టించు కోవడం లేదంటూ మండిపడ్డారు. గత కొన్నేళ్లుగా చిరుతలు లేకుండా పోవడం బాధాకరమన్నారు ఈ సందర్బంగా మోదీ.
ఇవాళ విడుదల చేయడం చారిత్రాత్మకమని పేర్కొన్నారు. దీనిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు జైరాం రమేష్(Jairam Ramesh). కాంగ్రెస్ పాలనలో కొనసాగింపును ప్రధాని ఎన్నడూ గుర్తించ లేదన్నారు.
ప్రధాన సమస్యలను పరిష్కరించకుండా ప్రచార ఆర్భాటంపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టారంటూ మండిపడ్డారు. ఇదిలా ఉండగా నమీబియా నుంచి ప్రత్యేక విమానంలో ఎనిమిది చిరుతలను తీసుకు వచ్చారు.
వీటిలో మూడు చిరుతలను ప్రధాన మంత్రి మోదీ రిలీజ్ చేశారు. అయితే జాతీయ ఉద్యాన వనంలో వాటిని విడిచి పెట్టడాన్ని తమాషాగా అభివర్ణించారు జైరాం రమేష్(Jairam Ramesh).
చిరుత ప్రాజెక్టు ఇందుకు ఒక ఉదాహరణగా పేర్కొన్నారు. ఇదిలా ఉండగా 2009-11లో పర్యావరణ , అటవీ శాఖ మంత్రిగా పని చేశారు జైరాం రమేష్. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలను బీజేపీ మండిపడింది.
ప్రతి దానిని భూతద్దంలో చూడడం ఆ పార్టీకి అలవాటుగా మారిందని ఎద్దేవా చేసింది. మొత్తంగా చిరుతల విడుదల రాజకీయ దుమారాన్ని రేపడం విశేషం.
Also Read : మరఠ్వాడా ప్రాంతపు అభివృద్దిపై ఫోకస్