Jaiveer Shergill : బీజేపీ స్పోక్స్ పర్సన్ గా జైవీర్ షెర్గిల్
కార్యవర్గ సభ్యులుగా అమరీందర్..సునీల్ జాఖర్
Jaiveer Shergill : భారతీయ జనతా పార్టీ మాజీ కాంగ్రెస్ నాయకులకు పెద్ద పీట వేస్తోంది. ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన వారందరికీ ప్రయారిటీ ఇస్తోంది. శుక్రవారం కీలక ప్రకటన చేసింది బీజేపీ. తాజాగా జైవీర్ షెర్గిల్(Jaiveer Shergill) కు కీలకమైన పోస్టు అందజేసింది. ఆ పార్టీకి జాతీయ అధికార ప్రతినిధిగా ప్రకటించింది.
పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ , పంజాబ్ కాంగ్రెస్ మాజీ చీఫ్ సునీల్ జాఖర్ ను పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులుగా నియమితులు అయ్యారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీని టార్గెట్ చేస్తూ కీలక వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు జైవీర్ షెర్గిల్.
కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన మూడు నెలల తర్వాత జైవీర్ షెర్గిల్(Jaiveer Shergill) కు కీలక పదవి అప్పగించడం విస్తు పోయేలా చేసింది బీజేపీ. ఆ పార్టీలో యూపీ మంత్రి స్వతంత్ర దేవ్ సింగ్ , ఉత్తరాఖండ్ బీజేపీ మాజీ చీఫ్ మదన్ కౌశిక్ , కాంగ్రెస్ మాజీ నాయకుడు రాణా గుర్మీత్ సింగ్ సోధి, పంజాబ్ మాజీ మంత్రి మనోరంజన్ కాలియాకు కూడా కీలక పదవులు కట్టబెట్టింది భారతీయ జనతా పార్టీ.
ఇదిలా ఉండగా రాహుల్ గాంధీని ఏకి పారేశాడు జైవీర్ షెర్గిల్ . పార్టీ నిర్ణయాధికారం ఎవరి చేతుల్లో ఉందంటే ఏం చెప్పగలం ఖర్గే చేతిలో లేదని అది అందరికీ తెలుసన్నారు.
ముగ్గురు గాంధీలు ఒక ఏడాది పాటు తనను కలవకుండా తిరస్కరించారని ఆరోపించారు. 39 ఏళ్ల వయస్సు మాత్రమే కలిగిన జైవీర్ షెర్గిల్ గతంలో కీలకమైన పాత్ర పోషించారు. అత్యంత పిన్న వయస్సులో టాప్ పోస్ట్ దక్కడం విశేషం.
Also Read : జనం బ్రహ్మరథం మోదీపై పూలవర్షం