RRR Movie : పండుగ వేళ జ‌క్క‌న్న స‌ర్ ప్రైజ్

ఆర్ఆర్ఆర్ పోస్ట‌ర్ రిలీజ్

RRR Movie : దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు జ‌క్క‌న్న ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న ఆర్ఆర్ఆర్ మూవీపై (RRR Movie)భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఇప్ప‌టికే డేట్ ఫిక్స్ చేసినా క‌రోనా దెబ్బ‌కు చిత్రాన్ని వాయిదా వేశారు.

ఇప్ప‌టికే మూవీకి సంబంధించిన అప్ డేట్స్ ఇస్తూ ప్రేక్ష‌కుల్లో, అభిమానుల్లో మ‌రింత ఉత్కంఠ రేపుతూ వ‌స్తున్నారు ద‌ర్శ‌క ధీరుడు. ఇప్ప‌టికే బాహుబ‌లి తో దేశ‌మంతా త‌న వైపు చూసేలా చేసిన ఎస్ఎస్ రాజ‌మౌళి మ‌రోసారి చరిత్ర సృష్టించేందుకు రెడీ అయ్యాడు.

ఇదిలా ఉండగా మూవీ ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉండేది. ఒమిక్రాన్ కేసులు పెర‌గ‌డం, థియేట‌ర్ ఆక్యుపెన్సీ , ప‌లు రాష్ట్రాల‌లో స్వ‌ల్ప లాక్ డౌన్ వంటి అనేక కార‌ణాల వ‌ల్ల ఆర్ఆర్ఆర్ మూవీని వాయిదా వేయ‌డ‌మే బెట‌ర్ అని నిర్ణ‌యానికి వ‌చ్చింది చిత్ర బృందం.

ఇదిలా ఉండ‌గా ఆర్ఆర్ఆర్ (RRR Movieప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాన్ని ముంబై, చెన్నై, బెంగ‌ళూరులలో గ్రాండ్ గా చేప‌ట్టారు కూడా. ఎక్క‌డికి వెళ్లినా జక్క‌న్న టీంకు అద్భుత‌మైన సాద‌ర స్వాగ‌తం ల‌భించింది.

ఇదిలా ఉండ‌గా మూవీకి సంబంధించిన పోస్ట‌ర్స్ , టీజ‌ర్స్, ట్రైల‌ర్స్ , సాంగ్స్ మిలియ‌న్ల కొద్దీ వ్యూస్ సంపాదించి పెట్టాయి. ఇంకెంత కాలం సినిమాను విడుద‌ల చేయ‌కుండా నాన్చుతారంటూ నెటిజ‌న్లు సీరియ‌స్ అయ్యారు.

ఈ మేర‌కు జ‌క్క‌న్న టీంను ట్రోల్ చేశారు. ఈ త‌రుణంలో అభిమానుల‌కు ఖుష్ క‌బ‌ర్ చెప్పాడు జ‌క్క‌న్న‌. సంక్రాంతి పండుగ‌ను పుర‌స్క‌రించుకుని బ్యూటిఫుల్ లుక్ తో కూడిన ఆర్ఆర్ఆర్ మూవీకి సంబంధించిన పోస్ట‌ర్ ను ఇవాళ రిలీజ్ చేశారు.

ట్విట్ట‌ర్ వేదిక‌గా పంచుకున్నారు. ఇదిలా ఉండ‌గా ఆర్ఆర్ఆర్ మూవీకి కీర‌వాణి మ్యూజిక్ అందిస్తున్నారు.

Also Read : సీఎం జ‌గ‌న్ స్పంద‌న సంతోషం

Leave A Reply

Your Email Id will not be published!