Elon Musk Zelensky : యావత్ ప్రపంచం వద్దన్నా ఉక్రెయిన్ పై దాడులకు పాల్పడుతున్న రష్యా దుందుడుకు ధోరణిపై, పుతిన్ రాజ్య కాంక్షపై తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం అవుతోంది.
ఓ వైపు దాడులు కొనసాగుతున్నా అలుపెరుగని రీతిలో పోరాటం చేస్తూ వస్తున్నారు ఉక్రెయిన్ దేశ అధ్యక్షుడు జెలెన్ స్కీ(Elon Musk Zelensky). మొదట్లో కొంత వెనుకంజ వేసినా ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా జెలెన్ స్కీ రియల్ హీరోగా మారి పోయాడు.
ఎక్కడ చూసినా అతడికి జేజేలు పలుకుతున్నారు. అతడి పోరాట పటిమను చూసి విస్తు పోతున్నారు. ఇలాంటి నాయకుడే తమ దేశానికి కావాలని కోరుతున్నారంటే అతడికి ఉన్న క్రేజ్ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు.
రష్యా కు వ్యతిరేకంగా జెలెన్ స్కీకి సంపూర్ణ మద్దతు అంతకంతకూ పెరుగుతోంది. ఓ వైపు నాటో మోసం చేసినా ఎలాంటి భయం లేకుండా తన ఆర్మీని ముందుకు నడిపిస్తున్నాడు జెలెన్ స్కీ.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, దిగ్గజాలు, దేశాలు అన్నీ ఇప్పుడు అతడి వైపు చూస్తున్నాయి. తాజాగా ప్రపంచ కుబేరుల్లో టాప్ లో ఉన్న వ్యాపార దిగ్గజం టెస్లా కార్ల సిఇఓ , చైర్మన్ ఎలన్ మస్క్ ఊహించని రీతిలో బేషరతుగా ఉక్రెయిన్ కు మద్దతు పలికాడు.
రష్యా ఉక్రెయిన్ పై తెలివిగా టెలికమ్యూనికేషన్ల వ్యవస్థపై దెబ్బ కొట్టింది. ఈ విషయాన్ని ముందే పసిగట్టిన దేశాధ్యక్షుడు జెలెన్ స్కీ సైబర్ అటాక్ స్టార్ట్ చేశాడు.
ఆ దేశానికి చెందిన సైబర్ నిపుణులు డిజిటల్ వార్ కు దిగారు. రష్యాకు చుక్కలు చూపిస్తున్నారు. ఎలన్ మస్క్ తన శాటిలైట్ సేవలను ఉపయోగించుకునేలా ఉక్రెయిన్ కు సహకారం అందిస్తున్నాడు. దీంతో రష్యా రోజు రోజుకు ఇబ్బంది పడుతోంది.
Also Read : ఐటీ పార్కుతో 50 వేల జాబ్స్