James Cleverly BBC Row : జై శంకర్ తో బీబీసీపై దాడి ప్రస్తావన
భేటీ అయిన యుకె కార్యదర్శి జేమ్స్
James Cleverly BBC Row : భారత్ జీ20 గ్రూప్ కు సారథ్యం వహిస్తోంది. ఈ సందర్భంగా ఢిల్లీలో ఇవాళ ,రేపు విదేశాంగ శాఖ మంత్రులతో ప్రత్యేక సమావేశం జరగనుంది. దీనిని పురస్కరించుకుని ప్రపంచ వ్యాప్తంగా ఆయా దేశాలకు సంబంధించిన విదేశాంగ శాఖ మంత్రులు ఢిల్లీ బాట పట్టారు. బుధవారం యునైటెడ్ కింగ్ డమ్ (యుకె) దేశానికి చెందిన విదేశాంగ కార్యదర్వి జేమ్స్(James Cleverly) భారత దేశ విదేశాంగ శాఖ మంత్రి సుబ్రమణ్యం జై శంకర్ తో భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా ఇటీవల భారత్ లోని బీబీసీకి చెందిన ఢిల్లీ, ముంబై ఆఫీసులలో ఏక కాలంలో భారత ప్రభుత్వానికి చెందిన ఆదాయపు పన్ను శాఖ దాడులు చేపట్టింది. మూడు రోజుల పాటు సోదాలు నిర్వహించింది. సిబ్బందికి చెందిన మొబైల్స్ , ల్యాప్ టాప్ లు, డెస్క్ టాప్ లు తీసుకు వెళ్లింది. ఇదే క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ది మోదీ క్వశ్చన్ పేరుతో బీబీసీ డాక్యుమెంటరీ ప్రసారం చేసింది.
ఇది పెద్ద ఎత్తున రాద్దాంతానికి దారి తీసింది. ఆయన గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలో చోటు చేసుకున్న అల్లర్ల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆ వెంటనే కేంద్ర సర్కార్ స్పందించింది.
దాని లింకులను సోషల్ మీడియాలో కనిపించ కూడదంటూ హుకూం జారీ చేసింది. చివరకు సుప్రీంకోర్టు దాకా వెళ్లింది. ఈ మొత్తం వ్యవహారం ప్రపంచాన్ని విస్తు పోయేలా చేసింది. ఈ తరుణంలో బ్రిటన్ కార్యదర్శి జేమ్స్ కలవడం(James Cleverly BBC Row) , ప్రత్యేకంగా దీని గురించే ప్రస్తావించడం కలకలం రేపింది. ఈ విషయాన్ని రాయిటర్స్ పంచుకుంది.
Also Read : దేశ సార్వభౌమత్వాన్ని గౌరవిస్తాం – పెన్నీ