J& K Delimitation : జమ్మూ కాశ్మీర్ ఎన్నికల మ్యాప్ కు సంబంధించి కేంద్రం నియమించిన డీలిమిటేషన్ కమిషన్ గురువారం తన తుది నివేదికను సమర్పించింది.
ఇందులో పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ , కాశ్మీర్ వలసదారులు, నిర్వాసితులకు అసెంబ్లీలో అదనపు సీట్లను కమిషన్ సిఫార్సు చేసింది.
ప్రక్రియ గనుక పూర్తయితే ఇక ఎన్నికలు నిర్వహించేందుకు వీలు కలుగుతుంది. ఇప్పటికే కేంద్రం 370 ఆర్డికల్ ను రద్దు చేసింది. పూర్వ రాష్ట్రంలో జూన్ 2018 నుండి ఎన్నుకున్న ప్రభుత్వం ఇప్పుడు లేదు.
మొత్తం ఐదు పార్లమెంటరీ నియోజకవర్గాలలో మొదటిసారిగా సమాన సంఖ్యలో అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండనున్నాయి. ఇందులో తొమ్మిది స్థానాలు షెడ్యూల్డు తెగలకు (ఎస్టీ) రిజర్వు చేశారు.
ఇది మునుపటి రాష్ట్రానికి మొదటిది కావడం విశేషం. ఇదిలా ఉండగా మొత్తం 90 అసెంబ్లీ నియోజకవర్గాలలో 43 జమ్మూ ప్రాంతంలో ఉండగా 47 కాశ్మీర్ లో భాగంగా ఉంటాయి.
డీలిమిటేషన్ ప్రయోజనాల కోసం జమ్మూ కాశ్మీర్ (J& K Delimitation )ను ఒకే సంస్థగా పరిగణించారు. జమ్మూలో మొత్తం అసెంబ్లీ స్థానాల సంఖ్య 37 నుంచి 43 కి పెరిగింది.
డీలిమిటేషన్ ఆర్డర్ ప్రకారం అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు సంబంధిత జిల్లా సరిహద్దుల్లోనే ఉండాలని స్పష్టం చేసింది. ఇక జమ్మూ కాశ్మీర్ పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం 2011 జనాభా లెక్కలు డీలిమిటేషన్ ప్రాతిపదికగా ఉండాలని తెలిపింది.
కాగా కమిషన్ చివరకి సమాజంలోని వివిధ వర్గాల రాజకీయ ఆకాంక్షలు, సామీప్యత వంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటుందని పేర్కొంది.
ఇదిలా ఉండగా డీలిమిటేషన్ ప్రక్రియ లోప భూయిష్టంగా ఉందని, అది బీజేపీకి మేలు చేకూర్చేలా ఉందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.
Also Read : భిల్వారాలో ఘర్షణ ఇంటర్నెట్ బంద్