Jana Reddy : హైదరాబాద్ – మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కందూరు జానా రెడ్డికి కోలుకోలేని షాక్ తగిలింది. ఆయన తాను కూడా సీఎం రేసులో ఉన్నానని ప్రకటించారు. ఇదే సమయంలో అభ్యర్థుల ఎంపిక కమిటీలో కీలక సభ్యుడిగా పార్టీ హైకమాండ్ నియమించింది. దీంతో ఎన్నికల బరిలో నిలిచేందుకు గాను నామినేషన్ దాఖలు చేశారు.
Jana Reddy Got Shocking News
తీరా తాను చేసిన దరఖాస్తును ఎన్నికల కమిషన్ తిరస్కరించింది. పూర్తిగా వివరాలు సరిగా నింప లేదని పేర్కొంది. దీంతో సుదీర్ఘ కాలం పాటు రాజకీయ అనుభవం ఉంది కందూరు జానా రెడ్డికి(Jana Reddy). ఆయనకు అజాత శత్రువు అన్న పేరు కూడా ఉంది.
ఎవరితోనైనా స్నేహం కోరుకునే జానా రెడ్డిని అన్ని పార్టీల వారు ఆయనను పెద్దన్నగా భావిస్తారు. గౌరవిస్తారు కూడా. ఉన్నట్టుండి ముఖ్యమంత్రి రేసులో నిలవాలని అనుకున్న జానా రెడ్డి ఆశలపై ఎన్నికల కమిషన్ నీళ్లు చల్లింది.
దీంతో ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. తాను ఒకటి తలిస్తే దైవం ఇంకొకటి తలిచినట్లుగా తయారైంది తన పరిస్థితి అని వాపోయారు కందూరు జానా రెడ్డి. ప్రస్తుతం సీఎం రేసులో మాటేమిటో కానీ కేవలం ఎమ్మెల్యే కోసం దాఖలు చేసిన పిటిషన్ ను కూడా సరిగా నింప లేక పోవడం దారుణమని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
Also Read : Bandla Ganesh : రేవంత్ రెడ్డి సీఎం కావడం ఖాయం