Hello AP Bye Bye YCP : హలో ఏపీ బై బై వైసీపీ – జనసేన
కొనసాగుతున్న వారాహి జైత్రయాత్ర
Hello AP Bye Bye YCP : ఏపీలో రాజకీయాలు మరింత రాటు దేలాయి. అధికారంలో ఉన్న వైసీపీని లక్ష్యంగా చేసుకుని పావులు కదుపుతున్నాయి ప్రతిపక్షాలు. ఇక కాంగ్రెస్ సైతం మరో అడుగు ముందుకేసింది. టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు సభలు, సమావేశాలతో హోరెత్తిస్తుంటే తనయుడు లోకేష్ బాబు యువ గళం పేరుతో పాదయాత్ర చేపట్టారు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్రతో రంగంలోకి దిగారు. ఆయన ప్రధానంగా వైసీపీని , సీఎంను జగన్ రెడ్డిని , మంత్రులను, ఎమ్మెల్యేలను ఏకి పారేస్తున్నారు.
గతంలో కాస్త మెతక వైఖరిని ప్రదర్శించిన పవన్ కళ్యాణ్ కానీ ఉన్నట్టుండి డోసు పెంచారు. మాటలతో మంటలు రేపుతున్నాయి. దమ్ముంటే కాచుకోండి చూద్దాం అంటున్నారు. ఆపై సవాళ్లు విసురుతూ మరింత కాకా పుట్టిస్తున్నారు పవర్ స్టార్.
ఇక జనసేనాని చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. ప్రధానంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన ఏపీ ప్రజలకు పిలుపునిచ్చారు. హలో ఏపీ బైబై వైసీపీ అంటూ ఇచ్చిన నినాదం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నెట్టింట్లో ట్రెండింగ్ లో కొనసాగుతోంది.
ఇక పవన్ కళ్యాణ్ కు భారీ ఎత్తున అభిమానులు ఉన్నారు. ఆరు నూరైనా సరే ఈసారి ఎన్నికల్లో తమ సత్తా ఏమిటో చూపిస్తామని ఇప్పటికే ప్రకటించారు పవన్ కళ్యాణ్. ఇదిలా ఉండగా జనసేన(Janasena) షేర్ చేసిన ఫోటో ఆలోచింప చేసేలా ఉంది.
Also Read : Bandi Sanjay : చీకటి రోజులకు తెర లేపిన దినం