Janasena I-PAK : మీ వ్య‌క్తిగ‌త డేటా ఎంత భ‌ద్రం

ప్ర‌శ్నించిన జ‌న‌సేన పార్టీ

Janasena I-PAK : జ‌న‌సేన పార్టీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. ఏపీ రాష్ట్రంలో ఐ ప్యాక్ సంస్థ , వైసీపీ జ‌గ‌న్ స‌ర్కార్ క‌లిసి పౌరుల‌కు సంబంధించిన వ్య‌క్తిగ‌త వివ‌రాల‌ను అనుమ‌తి లేకుండా వాడుతున్నారంటూ ఆరోపించింది. ఈ మేర‌కు ట్విట్ట‌ర్ వేదిక‌గా నిల‌దీసింది. పాన్ , ఆధార్, బ్యాంక్, ఏటీఎం లాంటి వివ‌రాలు చాలా కీల‌క‌మైన‌వ‌ని పేర్కొంది జ‌న‌సేన పార్టీ. ర‌హ‌స్యంగా ఉండాల్సిన‌వి. అవ‌స‌రం అయితే త‌ప్పా బ‌య‌ట‌కు చెప్ప‌కూడ‌దని స్ప‌ష్టం చేసింది.

అలాంటిది కేవ‌లం 250 మంది ఉండే ఒక వాట్సాప్ గ్రూప్ లో య‌ధేశ్చ‌గా పంపితే మీ డేటాకు భ‌ద్ర‌త ఎక్కుడ ఉంటుంద‌ని ప్ర‌శ్నించింది. గ్రూపులో ఉండే వారు మంచి వారు కాక పోవ‌చ్చు. మీ వివ‌రాలు మీకు తెలియ‌కుండా ఉప‌యోగించే ప్ర‌మాదం ఉంది. చ‌ట్ట వ్య‌తిరేక కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డ‌వ‌చ్చు. మీకు తెలియ‌కుండా మీ పేరుతో మోసాల‌కు పాల్ప‌డ‌వ‌చ్చు, ఆర్థిక నేరాలకు, మోసానికి పాల్ప‌డే ఛాన్స్ ఎక్కువ‌గా ఉంద‌ని హెచ్చ‌రించింది జ‌న‌సేన(Janasena) పార్టీ.

అంతే కాదు మ‌హిళ‌ల ఫోన్ నెంబ‌ర్ల‌ను షేర్ చేసి వేధించేందుకు వాడుకోవ‌చ్చు. మీ ఇంటి మ‌హిళ‌ల వ్య‌క్తిగ‌త వివ‌రాల‌ను అడ్డం పెట్టుకుని త‌ప్పుడు ప‌నుల‌కు పాల్ప‌డ‌వ‌చ్చు. మీ ఓట‌ర్ కార్డు తీసేయ‌వ‌చ్చు. మీకు తెలియ‌కుండానే ప‌థ‌కాలు ఆప వ‌చ్చ‌ని హెచ్చ‌రించింది. ఈ మొత్తం వివ‌రాల‌ను వాలంటీర్లు తీసుకుని ఎవ‌రికి ఇస్తున్నారో మీకు తెలుసా అని ప్ర‌శ్నించింది జ‌న‌సేన‌. ఐప్యాక్ చేస్తున్న మోసాన్ని గుర్తించాల‌ని కోరింది.

Also Read : Nara Lokesh : విశాఖ‌ను ఐటీ రాజ‌ధాని చేస్తాం

 

Leave A Reply

Your Email Id will not be published!