Janasena Master Plan : జనసేన మాస్టర్ ప్లాన్ రెడీ
ఉభయ గోదావరి జిల్లాల కోసం
Janasena Master Plan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జన సేన పార్టీ రెండో విడత వారాహి విజయ యాత్ర ఆదివారం నుండి ఏలూరు వేదికగా ప్రారంభం కానుంది. ఇప్పటికే తొలి విడత వారాహి విజయ యాత్ర సక్సెస్ కావడంతో జనసేన పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలు వేస్తోంది. మరో వైపు పవర్ స్టార్ పై సోషల్ మీడియా వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని వీర మహిళలు తీవ్రంగా తప్పు పట్టారు. ఈ మేరకు డీజీపీ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు.
తాజాగా సంచలన ప్రకటన చేసింది జన సేన(Janasena) పార్టీ. ఈ మేరకు ఉభయ గోదావరి జిల్లాల అభివృద్ది కోసం ప్రత్యేకంగా మాస్టర్ ప్లాన్ తయారు చేసినట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని ఆదివారం ట్విట్టర్ వేదికగా తెలిపింది. అన్నవరం నుండి జంగా రెడ్డి గూడెం వరకు 28కు పైగా పుణ్య క్షేత్రాలను కలుపుని ఆధ్యాత్మిక పర్యాటక రూట్ గా అభివృద్ది చేయాలని సంకల్పించింది.
నరసాపురంలో అత్యాధునిక బోట్ రేసింగ్ టూరిజం, కోనసీమ రైల్వే , సఖినేటిపల్లి వంతెన, లాస్ వెగాస్ తరహాలో భీమవరం డంప్ యార్డు నిర్మాణం చేపట్టనున్నట్లు జనసేన ప్రకటించింది. ఇక ఉభయ గోదావరి జిల్లాల్లోని మత్స్య కార గ్రామాలను స్మార్ట్ విలేజెస్ గా తీర్చి దిద్దుతామని మాస్టర్ ప్లాన్ లో పేర్కొంది. అంతే కాకుండా గోదావరి బేసిన్ లో ఉపాధి కోసం ఉన్నత స్థాయిలో స్కిల్ డెవలప్ మెంట్ కింద ట్రైనింగ్ ఇస్తున్నట్లు తెలిపింది. సిల్క్ సిటీగా ఉప్పాడను తీర్చి దిద్దుతామని స్పష్టం చేసింది.
Also Read : Centre Serious : గృహ నిర్మాణ నిధులపై కేంద్రం గుస్సా
